అంతరిక్షం నుండి తీసుకోచ్చిన ఎలుక స్పేర్మ్ నుండి ఎలుకలు జననం..?!

అంతరిక్షం అంటే అదొక వింత లోకం.అనేక అద్భుతాలు జరిగే ప్రాంతం.అంతరిక్షంలో శాస్త్రవేత్తలు వివిధ ప్రయోగాలు, పరిశోధనలు చేస్తూ ఉంటారు.

తాజాగా అలాంటి పరిశోధనే ఒకటి చేశారు.ఎలుక స్పెర్మును అంతరిక్షంలో భద్రపరిచి దాని ద్వారా పిల్లలు ఉత్పత్తిని కనుగొన్నారు.

దాదాపుగా ఆరు సంవత్సరాల క్రితం శాస్త్రవేత్తలు అంతరిక్షంలోకి ఓ ఎలుక స్పెర్మ్ ను తీసుకెళ్లారు.అక్కడే దాన్ని వ్యోమగాములు మైనస్ 139 డిగ్రీల ఫారన్ హీట్ తో భద్రపరిచారు.

అంటే మైనస్ 95 డిగ్రీల సెల్సియస్ తో ఎలుక స్పెర్మును ఫ్రీజర్ లో దాచారు.దాదాపుగా ఐదు సంవత్సరాల 10 నెలలు పూర్తయ్యింది.ఇప్పుడు ఎలుక స్పెర్మ్ ను భూమి పైకి తీసుకొచ్చారు.

Advertisement

దాన్ని కొన్ని ప్రత్యేక పద్దతులు, విధానాల ద్వారా పిల్లలను ఉత్పత్తి చేశారు.పరిశోధనలలో ఆ ఎలుక స్పెర్మ్ తాజాగా ఉండనుందని తేలింది.

దీంతో ఎలుక స్పెర్మ్ ను పిల్లల ఉత్పత్తికి వాడారు.దాంతో రీ ప్రొడక్షన్ ప్రాసెస్ విధానం ద్వారా ఆ ఎలుక స్పెర్మ్ తో 168 పిల్లలను జన్మనిచ్చింది.స్పెర్మ్ ద్వారా పుట్టిన ఎలుక పిల్లలకు ఎటువంటి అనారోగ్యం లేదు.2013లో ఆ స్పెర్మ్ ను అంతరిక్షానికి తీసుకెళ్లారు.ఇప్పుడు ఆ స్పెర్మే 168 మంది పిల్లలకు జన్మనిచ్చింది.

పుట్టిన ఎలుక పిల్లలకు ఏ రకమైన అవలక్షణాలనేవి లేవు.

జపాన్ లోని యూనివర్సిటీ ఆప్ యమనాషి లో మూడు బాక్సులతో ఎలుక స్పెర్మ్ ను నింపి పంపించగలిగింది.అందులో కూడా ప్రతి బాక్సులో 48 స్పెర్ములును ఏర్పాటు చేసి ఉంచింది.ఈ పరిశోధనలలో ఫ్రీజ్ ఎండిన స్పెర్మ్ ను ఆర్బిటాల్ అవుట్ పోస్టులో 200 ఏళ్ల వరకూ కూడా నిల్వ చేసుకోవచ్చని పరిశోధకులు తేల్చారు.

అభిమన్యుడి మరణం శ్రీకృష్ణుడికి ముందే తెలుసా..?
వీడియో వైరల్ : శోభనం గదిలో ఆలియా, రణ్ వీర్.. ఇదే తొలిసారి అంటూ..

ప్రస్తుతం జీవశాస్త్రంలో ఇదొక సరికొత్త అధ్యయనం.ఎలుక స్పెర్మ్ తో పిల్లలను ఉత్పత్తి చేయడం సరికొత్త అధ్యాయంగా పరిశోధకులు భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు