రష్మిక వయస్సు అంతనా....అసలు వయస్సు బయట పెట్టిన రష్మిక...పోస్ట్ వైరల్!

రష్మిక మందన్న ( Rashmika Mandanna ) ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోయిన్గా ఓవెలుగు వెలుగుతున్నారు.

ఒకవైపు సౌత్ సినిమాల ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వస్తూనే మరోవైపు బాలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.

ఇలా నటిగా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలుగుతున్న రష్మిక మందన్న సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.ఇకపోతే తాజాగా తన పుట్టినరోజు ( Rashmika Birthday ) గురించి ఈమె ఆసక్తికరమైన పోస్ట్ చేశారు.

Rashmika Very Excited To Celebrate Her Birthday Post Viral , Rashmika,rashmika B

ఏప్రిల్ 5వ తేదీ రష్మిక మందన్న పుట్టినరోజు కావడంతో ఈమె తన వయసు గురించి కూడా పలు విషయాలను వెల్లడించారు.తన పుట్టినరోజు గురించి చెబుతూ ఇన్ స్టాలో అందమైన సెల్ఫీ షేర్ చేసింది రష్మిక."ఇది నా పుట్టినరోజు నెల.నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను.పెద్దయ్యాక పుట్టినరోజు జరుపుకోవడం పట్ల ఆసక్తి తగ్గుతుందని చాలా మంది అంటుంటారు.

కానీ నా విషయంలో మాత్రం చాలా భిన్నంగా ఉంటుందని తెలిపారు.నేను పెద్దయిన తర్వాత నా పుట్టినరోజును జరుపుకోవాలని చాలా ఉత్సాహంతో ఆసక్తిగా ఉన్నానని తెలిపారు.

Rashmika Very Excited To Celebrate Her Birthday Post Viral , Rashmika,rashmika B
Advertisement
Rashmika Very Excited To Celebrate Her Birthday Post Viral , Rashmika,Rashmika B

ఇప్పటికే నాకు 29 ఏళ్లు అని నమ్మలేకపోతున్నాను…ఈ సంవత్సరం ఆరోగ్యంగా, సంతోషంగా, సురక్షితంగా గడిపాను.ఇప్పుడు నా బర్త్ డే జరుపుకోవడం ఎంతో విలువైనది అంటూ ఈమె తన పుట్టినరోజు గురించి ఈ పోస్ట్ చేయడమే కాకుండా ఇప్పటికే రష్మిక 29 సంవత్సరాలను పూర్తి చేసుకుని 30 వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నట్టు తెలిపారు.ఇలా ఈమె తన వయసు గురించి చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

ఇక ఇటీవల బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తో కలిసి నటించిన సికిందర్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

Advertisement

తాజా వార్తలు