రష్మిక మందన్న పై అక్కడ అనధికారిక బ్యాన్‌ కంటిన్యూ

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ( Rashmika mandanna )ప్రస్తుతం చేస్తున్న సినిమా లు ఏంటి అంటే వినిపించే పేర్లు పుష్ప 2 ( Pushpa 2 )ఇంకా యానిమల్‌.

అవే కాకుండా తెలుగు లో నితిన్ కు జోడీగా ఒక సినిమా లో నటిస్తోంది.

హిందీ లో ఒక సినిమా చర్చల దశలో ఉండగా తమిళంలో కూడా ఒక సినిమా కు ఈమె కమిట్ అయ్యింది.ఆ సినిమా షూటింగ్ ను త్వరలోనే ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.

ఆ సినిమా ఎప్పుడు ప్రారంభం అవ్వబోతుంది అనేది క్లారిటీ లేదు.

మొత్తానికి రష్మిక కెరీర్ లో ఫుల్ బిజీగా అయితే లేదు అనేది కన్ఫర్మ్‌.హీరోయిన్ గా ముద్దుగుమ్మ యొక్క క్రేజ్ ఆకాశమే హద్దు అన్నట్లుగా ఉంది.అయినా కూడా ఆమెకు వస్తున్న ఆఫర్లు మాత్రం అంతంత మాత్రమే.

Advertisement

బాలీవుడ్ లో యానిమల్‌ తో పాటు తెలుగు లో చేస్తున్న పుష్ప 2 సినిమా లు హిట్ అయితే తప్ప ఇండస్ట్రీ లో ఆమె మళ్లీ బిజీ అయ్యే అవకాశాలు లేవు అనిపిస్తుంది.ఇక ఈమె సొంత ఇండస్ట్రీ అయిన కన్నడం లో మాత్రం సినిమా ల్లో నటిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు.

ఆ మధ్య కన్నడం లో నటించడంను తాను ఎప్పటికి ఆస్వాదిస్తాను అంటూ చెప్పుకొచ్చింది.

హిందీ లో చేస్తున్నా మరే భాష ల్లో చేస్తున్నా కూడా కన్నడ భాష ల్లో మంచి కథ లతో వస్తే నటించేందుకు సిద్ధం అన్నట్లుగా పేర్కొంది.కానీ గత కొన్నాళ్లు గా ఈమె కన్నడ సినిమా లు ఏవీ కమిట్ అవ్వలేదు.ఈమె కమిట్ అవ్వలేదా.

లేదంటే ఈమె వద్దకు ఆఫర్లు రావడం లేదా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.మొత్తానికి సోషల్‌ మీడియా

ఏంటి భయ్యా.. స్వీట్ షాప్ కు స్వీట్స్ కొనడానికి వచ్చాయా ఏంటి ఎలుకలు(వీడియో)
జగన్ తప్పు తెలుసుకున్నారా ? ప్రక్షాళన కు సిద్ధమా ? 

కన్నడ సినిమా ఇండస్ట్రీ వర్గాల వారు ఈమెపై కోపంగా ఉన్నారు.ఆ మధ్య కాంతార గురించి చేసిన వ్యాఖ్యల కారణంగా ఈమెను బ్యాన్‌ చేయాలంటూ చాలా మంది డిమాండ్ చేశారు.

Advertisement

అధికారికంగా బ్యాన్ చేయలేదు కానీ అనధికారికంగా కన్నడం లో రష్మిక పై బ్యాన్ కొనసాగుతుందని దీన్ని బట్టి అర్థం అవుతోంది.

తాజా వార్తలు