చిరు, కళ్యాణ్ కృష్ణ కాంబో మూవీ నుంచి సిద్దు ఔట్...

ఈ ఇయర్ మొదట్లోనే వాల్తేరు వీరయ్య సినిమా( Waltair Veerayya ) తో అందరిని అలరించిన చిరంజీవి ఇక ఆగస్టు లో ‘భోళా శంకర్’సినిమాతో మళ్ళీ మన ముందుకు రాబోతున్నాడు…ఈ సినిమా తర్వాత చిరంజీవి ఏ సినిమా చేయాలి అని చాలా రోజులపాటు ఆలోచించిన చిరంజీవి ఎట్టకేలకు తన తదుపరి సినిమాని ‘బంగార్రాజు’ ఫేమ్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చేయనున్నారు… ఇందులో మెగాస్టార్ కి జోడిగా త్రిష నటించనుండగా, కీలక పాత్రల్లో సిద్ధు జొన్నలగడ్డ, శ్రీలీల సందడి చేయనున్నారని వార్తలు వినిపించాయి.అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ చేయడానికి సిద్ధు ఆసక్తి చూపించట్లేదని ఇన్ సైడ్ టాక్…ఎందుకంటే చిరంజీవి( Chiranjeevi ) లాంటి పెద్ద హీరో పక్కన చేయడం అంటే మాటలు కాదు అందుకే తను కొంచం ఇప్పుడే కెరియర్ ని సెట్ చేసుకునే ప్రాసెస్ లో ఉన్నాడు కాబట్టి ఇప్పుడే మళ్ళీ పెద్ద హీరోల సినిమాలో నటిస్తే తన కెరియర్ కి ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అని ఆలోచించుకొని తను ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తుంది…

 Dj Tillu Fame Siddhu Jonnalagadda Rejects Chiranjeevi Movie Offer,dj Tillu,siddh-TeluguStop.com
Telugu Bangarraju, Brodaddy, Chiranjeevi, Dj Tillu, Kalyan Krishna, Trisha-Telug

ఇక ఒకసారి సిద్ధు( Siddhu Jonnalagadda ) సినిమా కెరియర్ కనక చూసుకుంటే ఆయన ఇండస్ట్రీ లో హీరోగా ఎంట్రీ ఇచ్చి దాదాపు దశాబ్దం పైనే అవుతుంది.అయితే లాక్ డౌన్ సమయంలో వచ్చిన ‘కృష్ణ అండ్ హిజ్ లీలా’, ‘మా వింత గాధ వినుమా’ వంటి ఓటీటీ సినిమాలు అతనికి మంచి గుర్తింపు తీసుకొచ్చాయి.ఇక గతేడాది థియేటర్లలో విడుదలైన ‘డీజే టిల్లు’ అతని ఇమేజ్ ని పూర్తిగా మార్చేసింది.

ప్రస్తుతం అతను ‘డీజే టిల్లు'( DJ Tillu ) సీక్వెల్ గా తెరకెక్కుతోన్న ‘టిల్లు స్క్వేర్’లో నటిస్తున్నాడు.ఈ క్రమంలోనే అతనికి మెగాస్టార్ సినిమాలో నటించే అవకాశమొచ్చింది…నిజానికి సిద్దుకి ఇదొక గొప్ప అవకాశం కానీ అతను అది చేయడానికి ఇంట్రెస్ట్ గా లేడు అనేది క్లియర్ గా తెలుస్తుంది… అందుకే మెగాస్టార్ మూవీ ఆఫర్ ని అతను సున్నితంగా తిరస్కరించాడట.సిద్ధు నో చెప్పడంతో ఇప్పుడు అతని స్థానంలో మరో యంగ్ హీరోని వెతికే పనిలో దర్శకుడు కళ్యాణ్ కృష్ణ( Director Kalyan Krishna ) ఉన్నట్లు సమాచారం…

 DJ Tillu Fame Siddhu Jonnalagadda Rejects Chiranjeevi Movie Offer,DJ Tillu,Siddh-TeluguStop.com
Telugu Bangarraju, Brodaddy, Chiranjeevi, Dj Tillu, Kalyan Krishna, Trisha-Telug

ఇక ఇది ఇలా ఉంటే చిరంజీవి భోళా శంకర్ సినిమా( Bhola Shankar ) నుంచి నిన్న రిలీజ్ అయిన సాంగ్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది.ఈ సాంగ్ లో చిరంజీవి వేసిన స్టెప్పులు కూడా చిరంజీవి ఫ్యాన్స్ లో మంచి జోష్ ని నింపుతున్నాయి…దీంతో భోళా శంకర్ సినిమా మీద రోజు రోజుకీ మంచి అంచనాలు పెరుగుతున్నాయి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube