లాక్ డౌన్ ఎఫెక్ట్: తిరుమల లో దర్శనమిచ్చిన అరుదైన పిల్లులు

లాక్ డౌన్ ప్రజలపై ఎంత ప్రభావం చూపిందో అన్న సంగతి పక్కన పెడితే జంతువులు మాత్రం స్వేచ్ఛగా బయటకు వచ్చేసి జనావాసాల్లో కి రావడం మొదలు పెట్టాయి.

అయితే లాక్ డౌన్ తో జనాలు అందరూ ఇళ్లకే పరిమితమైపోయి ఉండడం తో జంతువులు అడవుల్లో నుంచి ఒక్కొక్కటిగా జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి.

ఇటీవల హైదరాబాద్ లో ఒక చిరుత ఇలానే జనావాసాల్లో హల్ చల్ చేసిన విషయం తెలిసిందే.ఈ లాక్ డౌన్ తో తిరుమల ఘాట్ రోడ్డు ప్రాంతంలో కూడా చాలా జింకలు బయట స్వేచ్ఛగా తిరుగుతున్న ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి.

అయితే ఇప్పుడు తాజాగా అదే తిరుమల శేషాచలం అడవుల్లో రెండు అరుదైన పిల్లి పిల్లలు దర్శనమిచ్చాయి.అయితే నిజంగా తెలియని వారు చూస్తే మాత్రం అవి నిజంగా పిల్లులేనా అన్న అనుమానం రాకమానదు.

అలాంటి అరుదైన పిల్లి పిల్లలను రోడ్డు నిర్మాణ కార్మికులు గుర్తించారు.తిరుమల రెండో ఘాట్ రోడ్డు చివరి మలుపు సమీపంలో కార్మికులు ఈ అరుదైన దేవాంగ పిల్లి పిల్లులను గుర్తించారు.

Advertisement

అయితే అనంతరం అటవీసిబ్బందికి విషయం చెప్పడం తో అక్కడకి చేరుకొని అవి అరుదైన జాతికి చెందిన పిల్లులని శేషాచలం అడవుల్లో నివసిస్తాయని తెలిపారు.

కొన్ని గిరిజన జాతులవారు దేవాంగ పిల్లుల్లో అద్భుతమైన ఔషధ గుణాలున్నాయని, అద్భుత శక్తులున్నాయని విశ్వసిస్తారట.అయితే భారతీయ అటవీ చట్టం ప్రకారం వీటిని పెంచుకోవడం, అమ్మడం నేరం.అందుకే అక్కడ దొరికిన పిల్లులను అదే అడవిలో వదిలిపెట్టారు.

దేవాంగ పిల్లులు 6 నుండి 15 అంగుళాల పరిమాణంలో ఉంటాయి.చెట్ల చిటారు కొమ్మలపై జీవిస్తూ ఆకుల్ని, పురుగుల్ని తినే ఈ చిన్న జీవుల సగటు జీవితకాలం 12 నుండి 15 ఏళ్ల వరకు ఉంటుందట.

వీడియో వైరల్ : శోభనం గదిలో ఆలియా, రణ్ వీర్.. ఇదే తొలిసారి అంటూ..

Advertisement

తాజా వార్తలు