బాలీవుడ్ ప్రముఖుల ఇళ్లలో కరోనా కలకలం సృష్టిస్తోంది.ఇటీవల బోనికపూర్ ఇంట్లో పని చేసే వారికి పాజిటివ్ అని తేలగా, నిన్న బాలీవుడ్ సీనియర్ నటుడు,సీరియల్ నటుడు కిరణ్ కుమార్ కు కూడా కరోనా సోకిన విషయం తెలిసిందే.
అయితే ఇప్పుడు తాజాగా మరో ప్రముఖుడి ఇంట్లో కూడా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు తెలుస్తుంది.బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు,నిర్మాత కరణ్ జోహార్ ఇంట్లో పని చేసే ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తుంది.
ఈ విషయాన్ని స్వయంగా తన ట్విట్టర్ ఖాతా లో వెల్లడించారు.ప్రస్తుతం వారిని ఆసుపత్రికి తరలించి వారికి కావాల్సిన వైద్య సేవలు అందిస్తున్నట్లు కరణ్ పేర్కొన్నారు.
వారిని ఐసోలేషన్‌కు తరలించిగా, ప్రస్తుతం కరణ్ ఫ్యామిలి హోం క్వారంటైన్ ఉన్నట్టుగా వెల్లడించారు.వరుస ఘటనలతో బాలీవుడ్ ప్రముఖుల్లో కరోనా కలవరం మొదలైంది.
ఇప్పటికే దేశవ్యాప్తంగా కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతుండడం మరింత ఆందోళన కలిగిస్తుంది.గత నాలుగు రోజులుగా రోజుకు 6 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతుండడం తో ప్రభుత్వాలు మరిన్ని చర్యలు చేపడుతున్నాయి.