శరవేగంగా పట్టణ సుందరీకరణ పనులు: మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట శాసన సభ్యులు,రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి( Jagadish Reddy ) సారథ్యంలో అందమైన పట్టణంగా రూపుదిద్దుకుంటున్న సూర్యాపేట పట్టణంలో సుందరీకరణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.

ఇప్పటికే గ్రీనరీతో పూర్తైన ఐ లవ్ సూర్యాపేట( I Love Suryapet ), తెలంగాణా వంటి గ్రీనరీ బోర్డ్ లు సెల్ఫీ పాయింట్లుగా మారిపోయాయి.

టాంక్ బండ్ నుండి హైవే వరకు చెరువు కట్ట పొడవునా దిగువన ఏర్పాటు చేసిన రకరకాల పూల మొక్కలు వాహనదారులను కనువిందు చేస్తున్నాయి.ఈ మేరకు గురువారం పట్టణంలోని మెడికల్ కాలేజ్,సద్దుల చెరువు మినీ టాంక్ బండ్ వద్ద జరిగిన,జరగాల్సిన పనులను మంత్రి జగదీష్ రెడ్డి అధికారులతో కలిసి పర్యవేక్షించారు.

దాదాపు పట్టణంలో రెండు గంటల పాటు పర్యటించిన మంత్రి,ఎన్టీఆర్ చౌరస్తా, జనగాం క్రాస్ రోడ్ లో ఆధునికరణ పనులను వేగవంతం చేయాలని సూచించారు.పచ్చదనం ఉట్టిపడేలా చౌరస్తాలను తీర్చిదిద్దాలని ఆదేశించారు.

గత పది రోజులుగా కురుస్తున్న వర్షాలతో స్వల్పంగా దెబ్బతిన్న ఎన్టీఆర్ పార్క్( NTR Park ) వద్ద గల రహదారులను వెంటనే మరమ్మత్తు చేయాలని అధికారులు సూచించారు.మెడికల్ కాలేజీ హాస్టల్ విద్యార్థుల కోసం,వారికి ఇబ్బందులు తలెత్తకుండా మరో గేటును ఏర్పాటు చేయాలని సూచించారు.

Advertisement

సాధ్యమైనంత తొందరగా నాణ్యతతో కూడిన గ్రీనరీ పనులను పూర్తిచేయాలని మంత్రి ఆదేశించారు.సూర్యాపేటను దేశంలోనే నెంబర్ వన్ పట్టణంగా తీర్చిదిద్దడానికి జరుగుతున్న యజ్ఞంలో అధికారులకు తోడుగా ప్రజలు కూడా భాగస్వామి అందించాలని మంత్రి జగదీశ్ రెడ్డి పిలుపునిచ్చారు.

జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన సన్ ప్రీత్ సింగ్...!
Advertisement

Latest Suryapet News