కల్కి సినిమాపై రణవీర్ ప్రశంసల వర్షం.. దీపికా నటనపై ఇంట్రెస్టింగ్ కామెంట్!

రెబల్ స్టార్ పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ( Prabhas ) నటించిన కల్కి సినిమా( Kalki Movie ) ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.

ఈ సినిమా విడుదల అయ్యి వారం అవుతున్నప్పటికీ కలెక్షన్ల విషయంలో ఏ మాత్రం వెనకడుగు వేయకుండా భారీ స్థాయిలో కలెక్షన్లను రాబడుతూ సంచలనాలను సృష్టిస్తోంది.

ఇక ఈ సినిమాకి ఎంతో మంచి సక్సెస్ కావడంతో ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు ఈ సినిమా విజయం పై స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టులు వైరల్ అవుతున్నాయి.

ఈ క్రమంలోనే బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ ( Ranveer Singh ) సైతం కల్కి సినిమా చూడటమే కాకుండా ఈ సినిమాపై తన అభిప్రాయాలను తెలియజేస్తూ చిత్ర బృందం పై ప్రశంసల వర్షం కురిపించారు.ఈ సందర్భంగా ఈయన కల్కి పోస్టర్ ను తన ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ.కల్కి 2898 AD ఒక గొప్ప .ఇది నిజమైన బిగ్ స్క్రీన్ .భారతీయ లో అత్యుత్తమమైనది, నాగి సర్, మొత్తం టీమ్‌కు అభినందనలు అని రాసుకొచ్చాడు.అలాగే రెబల్ స్టార్ నటన రాకింగ్ అంటూ చెప్పకు వచ్చారు.

ఇక తన భార్య దీపికా పదుకొనే( Deepika Padukone ) కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన సంగతి మనకు తెలిసిందే.ఇక ఆమె నటన గురించి ఈయన వర్ణిస్తూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.నా బేబీ దీపికా పదుకొనే ఎంతో అద్భుతంగా నటించింది.

Advertisement

అంత హత్తుకునే నటన, అంత శక్తి, నీకు ఎవరితోనూ పోటీ లేదు.నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటూ దీపికా పట్ల ఈయన ప్రత్యేకంగా ప్రశంశల వర్షం కురిపించారు.

ఇక అమితాబ్ గురించి కమల్ హాసన్ గురించి కూడా ఈయన విడివిడిగా ప్రశంసలు కురిపిస్తూ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.ఇక దీపిక పదుకొనే మొదటిసారి పాన్ ఇండియా తెలుగు సినిమాలో నటించి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

Advertisement

తాజా వార్తలు