అమావాస్యరోజు ముగ్గులు ఎందుకు వేయకూడదు?

సాధారణంగా ప్రతి ఇంటిలో మహిళలు ఉదయం లేవగానే ఇంటి ముందు ఉన్న చెత్తను ఊడిచేసి నీళ్లతో కళ్ళాపు జల్లి ముగ్గులు వేయటం జరుగుతూనే ఉంటుంది.

దాంతో ఇంటి ముందు ప్రాంతం అంతా అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది.

అయితే పండితులు అమావాస్య రోజున ముగ్గులు వేయకూడదని చెప్పుతున్నారు.అమావాస్య ముందు రోజున ఇంటికి పితృ దేవతలు వస్తారు.

Rangoli Will Not Do On Amavasya Day-Rangoli Will Not Do On Amavasya Day-Devotion

అందువలన ఆ సమయంలో పితృదేవతలకు అర్ఘ్యమిస్తే.వంశాభివృద్ధి, అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయని పండితులు చెప్పుతున్నారు .ఆరోజు ఇంటిముందు వున్న చెత్తను శుభ్రం చేసుకుని, నీటిని చల్లుకోవచ్చు కానీ ముగ్గులు ఎట్టి పరిస్థితిలో వేయకూడదని చెప్పుతున్నారు పండితులు.ఒకవేళ ముగ్గులు వేస్తె పితృ దేవతలు రాకుండా ఇంటి బయట వాకిలిలోనే ఆగిపోతారు.

అందువలన అమావాస్య రోజున పితృ దేవతలను మనసారా ప్రార్ధించాలని పండితులు అంటున్నారు.పితృ దేవతలకు అమావాస్య చాలా ప్రీతికరమైన రోజు.

Advertisement

ఆ రోజు పితృ దేవతలను కొలిస్తే సకల సంపదలు కలుగుతాయని పండితులు అంటున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్17, గురువారం 2025
Advertisement

తాజా వార్తలు