రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. !

ఈ మధ్యకాలంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను గమనిస్తే ఎక్కువగా నిర్లక్ష్యం, మరియు అతివేగం వల్ల జరుగుతున్నాయని తేలిందట.

ఇక నేడు యువత చేతికి వాహనం దొరికితే చాలు కోతికి కొబ్బరి చిప్ప దొరికినంత ఆనందం కలుగుతుంది.

ఆ పట్టరాని సంతోషంలో వాహనాన్ని ఎంత వేగంలో నడుపుతున్నారో కూడా చూసుకోరు.ఇకపోతే ఇలాగే వేగంగా వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్న ఘటన రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ జాతీయ రహదారి పై చోటు చేసుకుంది.

Rangareddy-district-road-accident-at-shadh-nagar-highway Rangareddy District, Ro

షాద్ నగర్ జాతీయ రహదారి బైపాస్ అన్నారం వై జంక్షన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.ఆ వివరాలు చూస్తే.

హైదరాబాద్ నుంచి జడ్చర్ల వైపు వస్తున్న షిఫ్ట్ కారు అన్నారం వై జంక్షన్ వద్ద డివైడర్‌ను ఢీకొని అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది.ఈ సంఘటనలో ఓ బాలుడితో పాటు మరో ఇద్దరు మృతి చెందినట్లు పేర్కొంటున్నారు.

Advertisement

కాగా ఆదివారం సెలవు రోజు కావడంతో హైదరాబాద్ నుండి జడ్చర్ల వైపు చేపలు పట్టేందుకు సరదాగా వెళుతూ వీరు ప్రమాదానికి గురైనట్లు ప్రాధమిక సమాచారం అందింది.ఇక సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.కాగా మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదు.

Advertisement

తాజా వార్తలు