చరణ్‌కు విలన్‌గా భల్లాలదేవుడు

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ ప్రస్తుతం నటిస్తున్న ‘బ్రూస్‌లీ’ చిత్రం విడుదల అవ్వగానే తమిళంలో ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన ‘తని వరువన్‌’ చిత్రం రీమేక్‌లో నటించనున్నాడు.

ఇప్పటికే ఈ చిత్ర రీమేక్‌ రైట్స్‌ను ప్రముఖ నిర్మాత దక్కించుకుని, రామ్‌ చరణ్‌కు అడ్వాన్స్‌ కూడా ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది.

ఆ రీమేక్‌లో చరణ్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు.ఇదే సినిమాలో చరణ్‌ స్నేహితుడు అయిన రానా విలన్‌గా నటించబోతున్నట్లుగా ఫిల్మ్‌ సర్కిల్స్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

‘బాహుబలి’ చిత్రంలో భల్లాలదేవిడి పాత్రలో రానా కనబర్చిన నటన సూపర్బ్‌.అందుకే రానాతో తలబడాలని రామ్‌ చరణ్‌ కోరుకుంటున్నట్లుగా సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే నిర్మాత రానాతో సంప్రదింపులు జరిపాడని, చరణ్‌ చెప్పడంతో రానా ‘తని వరువన్‌’ చిత్రం రీమేక్‌లో నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.తమిళంలో జయం రవి మరియు నయనతార జంటగా తెరకెక్కగా, అరవింద్‌ సామి ముఖ్య పాత్రలో కనిపించాడు.

Advertisement

త్వరలో ఈ రీమేక్‌పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నాయి.

తెల్లటి మెరిసేటి మోచేతుల కోసం ఇవి ప్రయత్నించండి!
Advertisement

తాజా వార్తలు