తన ప్రేయసిని బయటపెట్టిన రానా.. ఎవరో తెలుసా?

యంగ్ హీరో రానా దగ్గుబాటి టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకోవడంలో సక్సెస్ అయ్యాడు.

తనదైన మార్క్ నటనతో ప్రేక్షకులను మెప్పించడంలో రానా మంచి విజయాన్ని అందుకున్నాడు.

ఇక బాహుబలి చిత్రంలో భళ్లాలదేవ పాత్రలో రానా యాక్టింగ్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.ఆ తరువాత రానా చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు.

దర్శకుడు తేజ డైరెక్ట్ చేసిన నేనే రాజు నేనే మంత్రి సినిమాతో అదిరిపోయే కమర్షియల్ సక్సెస్‌ను కూడా అందుకున్నాడు ఈ హీరో.అయితే టాలీవుడ్‌లో ఉన్న బ్యాచ్‌లర్ హీరోల్లో రానా కూడా ఒకరు.

ఇప్పటికే 35 ఏళ్ల వయసున్న రానా పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడా అని అందరూ ప్రశ్నించారు.అయితే రానాకు అమ్మాయిలంటే పెద్దగా ఇష్టం ఉండదని, ఆయన పెళ్లి చేసుకుంటారో లేదో అనే సందేహం కూడా చాలా మందిలో ఉండేది.

Advertisement

కానీ అందరినీ అవాక్కయ్యేలా చేస్తూ, రానా తన గర్ల్‌ఫ్రెండ్ ఎవరనేది తాజాగా రివీల్ చేశాడు.మిహీకా బజాజ్ అనే హైదరాబాదీ అమ్మాయిని రానా గతకొంత కాలంగా ప్రేమిస్తున్నాడట.

కాగా ఎట్టకేలకు ఆమె తనకు ఓకే చెప్పిందని, త్వరలోనే పెళ్లి పీటలెక్కేందుకు రెడీ అవుతున్నాడట.ఈ మేరకు ఆమెతో కలిసి రానా దిగిన ఫోటోను తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.రానా త్వరలోనే ఓ ఇంటివాడు కానుండటంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

టాలీవుడ్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు కొడుకుగా రానా దగ్గుబాటికి మంచి ఫాలోయింగ్ ఉన్న విషయం అందరికీ తెలిసిందే.ఇక రానా ప్రేమిస్తున్న అమ్మాయికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇండస్ట్రీ వర్గాలు ఆసక్తి చూపుతున్నారు.

పవన్ కళ్యాణ్ కి మద్దతుగా రామ్ చరణ్..!!
Advertisement

తాజా వార్తలు