వర్మ సినిమాకు తప్పని కరోనా ఎఫెక్ట్‌

రామ్‌ గోపాల్‌ వర్మ ఏదైనా చేయాలనుకుంటే చేసి తీరుతాడు.తాను అనుకున్న విషయం అయ్యే వరకు ఊరుకోడు.

ఎంతటి అడ్డంకులు వచ్చినా, ఎవరు అడ్డు వచ్చినా కూడా ముందుకు సాగుతాడు.ఎన్నో మాఫియా నేపథ్యంలో సినిమాలు తెరకెక్కించి అప్పటి కేంద్ర ప్రభుత్వంకు సవాల్‌ విసిరిన దర్శకుడు వర్మ.

లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చిత్రాన్ని తెరకెక్కించి ఏపీ సీఎంకే ముచ్చెమటలు పట్టించిన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ.ఎన్నో వివాదాస్పద చిత్రాలను తెరకెక్కించిన వర్మ ఇప్పుడు ఎంటర్‌ ది గర్ల్‌ డ్రాగన్‌ చిత్రాన్ని హాలీవుడ్‌ స్థాయిలో తెరకెక్కించిన విషయం తెల్సిందే.

లేడీ ఫైటర్‌ కథాంశంతో రూపొందిన ఈ చిత్రం విడుదలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఇండియాలోనే కాకుండా ఈ చిత్రాన్ని చైనా మరియు జపాన్‌లో కూడా విడుదల చేయాలని వర్మ భావించాడు.ఆ మద్య చైనాలో వర్మ ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశాడు.

Advertisement

ఇంటర్నెషనల్‌ ట్రైలర్‌ అంటూ దానికి పేరు పెట్టి చైనాలో విడుదల చేయడంతో అందరి దృష్టి ఈ చిత్రంపై పడిరది.కాని ఇప్పుడు ఈ సినిమాను ముందుకు తీసుకు వెళ్లడంలో వర్మ కష్టపడుతున్నాడు.

ప్రస్తుతం చైనాలో కరోనా వైరస్‌ అల్లకల్లోం సృష్టిస్తుంది.అన్ని రంగాలు కూడా అక్కడ కుదేలయ్యాయి.ముఖ్యంగా సినిమా పరిశ్రమ పూర్తిగా దెబ్బడిపోయింది.

వేలాదిగా ఉన్న సినిమా థియేటర్లు దాదాపుగా మూత పడే పరిస్థితిలో ఉన్నాయి.జనాలు లేక మల్లీప్లెక్స్‌లు మరియు థియేటర్లు మూసివేశారు.

దాంతో సినిమాను విడుదల చేయాలనుకున్న వర్మ ఆగాడు.అక్కడ ప్రమోషన్‌ కోసం వెళ్లాలనుకున్నా కూడా సాధ్యం కావడం లేదు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
నాగార్జున 100 వ సినిమా కథను అందిస్తున్న యంగ్ రైటర్స్...

కొన్ని సీన్స్‌ను అక్కడ చిత్రీకరించాల్సి ఉండగా వర్మ ఇప్పుడు అక్కడకు వెళ్లలేని పరిస్థితి ఉంది.ఈ పరిస్థితుల నుండి ఎప్పుడు చైనా బయటకు వస్తుందో వర్మ సినిమాకు ఎప్పుడు మోక్షం కలుగుతుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు