మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రంలో నటిస్తున్నాడు.ఆ తర్వాత ఆచార్య చిత్రంలో కూడా ఈయన నటించేందుకు ఓకే చెప్పాడు.
ఈ రెండు చిత్రాల తర్వాత చరణ్ నటించబోతున్న సినిమా ఏది అనేది ప్రస్తుతం అందరి ముందు ఉన్న ప్రశ్న.వచ్చే ఏడాది ద్వితీయార్థంలో చరణ్ కొత్త సినిమా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.
అది ఎవరి దర్శకత్వంలో ఏంటీ అనే విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.
యువ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా చేసే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి.
కొన్నాళ్ల క్రితం వీరిద్దరి మద్య కథా చర్చలు కూడా జరిగాయి.కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం చరణ్ మరో కథను కూడా విని ఓకే చెప్పాడు.
ఆ సినిమాను ముందు చేస్తాడు అంటూ కొందరు అంటున్నారు.

గత కొన్నాళ్లుగా చరణ్ కొత్త సినిమాకు సంబంధించిన అప్‌డేట్ ఏమీలేదు.కనుక గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సినిమా ఉంటుందో లేదో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ప్రస్తుతం చరణ్ పూర్తిగా విశ్రాంతిలో ఉన్నాడు.
త్వరలో ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం షూటింగ్‌లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది.అదే సమయంలో ఆచార్య చిత్రంను కూడా చేయబోతున్నాడు.
ఈ రెండు సినిమాలు పూర్తి అయితే కొత్త సినిమా తాలూకు ప్రకటన వచ్చే అవకాశం ఉంది.