తర్వాత సినిమా మీద క్లారిటీ ఇచ్చిన రామ్ పోతినేని..డైరెక్టర్ ఎవరంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరో గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు రామ్ పోతినేని( Ram Pothineni ) దేవదాస్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన ఈయన ఆ సినిమా ఇచ్చిన సక్సెస్ తో వరుసగా సినిమాలను చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు.

ఇక ఈ సినిమాతోనే సూపర్ సక్సెస్ ని అందుకున్నారు.

ఇక రామ్ చేసిన మొదటి సినిమాతోనే ఎనర్జిటిక్ స్టార్ గా గుర్తింపు పొందడమే కాకుండా యూత్ లో మంచి ఫాలోయింగ్ ను కూడా సంపాదించుకున్నాడు.

ఇక 2019 వ సంవత్సరంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్( Ismart Shankar ) సినిమాతో మాస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఏర్పాటు చేసుకున్న ఈయన ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ సినిమాతో( Double Ismart ) ఆ ఫాలోయింగ్ ను మరింత రెట్టింపు చేసుకోవాలనే ఉద్దేశ్యం తో ఉన్నట్టుగా తెలుస్తుంది.ఇక అందులో భాగంగానే ఆయన ఈ సినిమా మీద ఎక్కువ ఫోకస్ చేసి ముందుకు సాగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది.ఇక ఇదిలా ఉంటే రామ్ పోతినేని తన తర్వాత సినిమాని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో చేయబోతున్నాడనే విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

ఇక ఈ సినిమాకి డైరెక్టర్ గా ఎవరు వ్యవహరిస్తున్నారు అనే విషయం మీద చాలా రోజుల నుంచి చాలా చర్చలు అయితే జరుగుతున్నాయి.

Advertisement

ఇక మొత్తానికైతే దీని మీద సస్పెన్స్ వీడి ఒక క్లారిటీ అయితే వచ్చింది.ఇక ఈ సినిమాని మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాను డైరెక్షన్ చేసిన మహేష్ బాబు( Director Mahesh Babu ) డైరెక్షన్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.అయితే మైత్రి మూవీ మేకర్స్ అతనికి ముందుగానే అడ్వాన్స్ ఇచ్చి పెట్టారట.

ఇక దానికి తగ్గట్టుగానే ఆయన చెప్పిన స్క్రిప్ట్ కి రామ్ ఓకే చెప్పినట్టుగా వార్తలైతే వస్తున్నాయి.ఇక మొత్తానికైతే డబుల్ ఇస్మార్ట్ సినిమా తర్వాత ఈ సినిమాను పట్టాలెక్కించే పనిలో రామ్ బిజీ గా ఉన్నట్టుగా తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు