ప్రైవేట్ పై గవర్నమెంట్ పెత్తనం ఏంటో.. ఏపీ ప్రభుత్వంపై వర్మ షాకింగ్ సెటైర్లు!

టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు తప్పుపడుతూ చేసిన వాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

నిత్యావసర వస్తువుల పై లేని ఫిక్స్డ్ రేట్లు, సినిమా టిక్కెట్ల పైన ఎందుకు అంటూ ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు రామ్ గోపాల్ వర్మ.

తాజాగా ఒక ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ.ఏపీ ప్రభుత్వం పెట్టుబడులు ప్రోత్సహిస్తూ ప్రభుత్వం భూములు కేటాయించడం లాంటివి చేస్తుంది.

అంతే కాకుండా ప్రభుత్వం తరపున ప్రోత్సాహకాలను అందిస్తుంది.ఇలాంటిదే సినిమా థియేటర్స్ లో ఉందో లేదో నాకు తెలియదు కానీ.

థియేటర్స్ లో లేకపోతే ఒక పర్సన్ సినిమా తీస్తాడు.తనకు ఇష్టం వచ్చిన విధంగా ఇష్టమైన రేట్లు పెట్టుకుంటాడు.

Advertisement

ఓపిక ఉన్నోడు సినిమా చూస్తాడు.లేనోడు మానేస్తాడు.

అలాంటిది ఈ విషయంలో ప్రభుత్వం ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది.ఏ రైట్ వుంది ప్రభుత్వానికి అంటూ నిలదీశాడు.

ఒక హోటల్ పెట్టినవాడు.ఒక ఇడ్లీ పది, వంద, వెయ్యి అలా వారికి ఇష్టం వచ్చిన విధంగా రేటు పెట్టుకుంటాడు.

నచ్చినవాడు తింటాడు.ఎక్కువ రేటు అనుకునేవాడు మానేస్తాడు.

రెండు స్పూన్ల బియ్యంతో హెయిర్ ఫాల్ దూరం.. ఎలా వాడాలంటే?
నితిన్ తన నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ తో చేస్తున్నాడా..?

గవర్నమెంట్ వచ్చి ఇంతే రేట్ పెట్టాలి అని ఎలా అంటుంది .ఆ లాజిక్ నాకు అర్థం కావడం లేదు అని తెలిపాడు.

Advertisement

అదే విధంగానే ఒక బట్టల షాపు పెడతాం.అందులో షర్టు ఐదు వందలు, ఐదు వేలు ఇలా వాడికి ఇష్టం వచ్చిన విధంగా పెట్టుకుంటాడు.ఎవరీ స్తోమత కు తగ్గట్టుగా వాళ్లు కొనుక్కుంటారు.అందుకు ప్రభుత్వానికి  ట్యాక్స్ వస్తుంది కదా.50 వేలు పెట్టి షర్ట్ కొంటె ఐదు వేల రూపాయలకే అమ్మాలి అంటూ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వడం ఏంటో నాకు అర్థం కావడం లేదు.ఒక సినిమా టికెట్ల విషయం పైన ఎందుకు ఫిక్స్డ్ రేట్లు పెడుతున్నారు అంటూ ప్రశ్నించాడు ఆర్జీవి.

ప్రజలు కొనే ప్రతి ఒక్క వస్తువు పైన కూడా ఫిక్స్డ్ రేట్లు పెట్టాలి కదా.అలా కాకుండా కేవలం సినిమా టికెట్ల విషయంలోనే ఎందుకు ఇలా చేస్తున్నారు.గవర్నమెంట్ ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది.

పెట్టుబడులు పెడితే అది వేరే విషయం.సినిమాలు తీయడానికి డబ్బులు ఇచ్చారా? లేదు కదా మరి అలాంటప్పుడు ప్రైవేట్ పై ప్రభుత్వం రైట్ ఎలా ఉంటుంది అని ప్రశ్నించారు రామ్ గోపాల్ వర్మ.

తాజా వార్తలు