ఒక్క సినిమాకు రెండు ప్రమోషనల్‌ సాంగ్స్‌.. జక్కన్నకే ఇది సాధ్యం

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి ఏం చేసినా కూడా ప్రత్యేకంగా ఉంటుంది అంటూ మరోసారి ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా తో నిరూపితం అవ్వబోతుంది.

జక్కన్న రాజమౌళి ప్రస్తుతం తెరకెక్కిస్తున్న ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా షూటింగ్‌ ముగింపు దశకు చేరుకుంది.

ఉక్రెయిన్‌ షెడ్యూల్‌ తో సినిమా పూర్తి అవుతుంది.ఇక సినిమా చిత్రీకరణ మొదలు పెట్టినప్పటి నుండి సినిమాపై అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి.

తాజాగా ఈ సినిమా నుండి దోస్తి పాటను విడుదల చేశారు.సినిమా నుండి మరో సాంగ్‌ ను వచ్చే నెల ఆరంభంలో విడుదల చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే నెల ఆరంభంలో విడుదల కాబోతున్న పాట కూడా ప్రమోషనల్‌ సాంగ్ అని.అందులో సినిమా మేకింగ్‌ ను చూపించడంతో పాటు హీరోలకు సంబంధించిన మేకప్‌ ఇతర విషయాలను చూపిస్తారని తెలుస్తోంది.

Ram Charan And Ntr Rrr Movie Second Promotional Song , Flim News, Ntr, Rajamouli
Advertisement
Ram Charan And Ntr Rrr Movie Second Promotional Song , Flim News, Ntr, Rajamouli

రికార్డు బ్రేకింగ్‌ వసూళ్లు లక్ష్యం గా ఆర్ ఆర్‌ ఆర్ రాబోతుంది.అంతటి వసూళ్లను దక్కించుకోవాలంటే ఈ సినిమా ఖచ్చితంగా భారీ ఎత్తున ప్రచారం దక్కించుకోవాలి.ఇప్పటికే ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా కు విపరీతమైన బజ్‌ ఉంది.

ఈసమయంలో సినిమా నుండి మరో ప్రమోషనల్‌ సాంగ్‌ వస్తే అది ఏ రేంజ్ కు సినిమాకు తీసుకు వెళ్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.రికార్డ్‌ బ్రేకింగ్‌ వసూళ్లను ఈ సినిమా దక్కించుకుంటుందనే నమ్మకంతో యూనిట్‌ సభ్యులు ఉన్నారు.

అంతే కాకుండా ఈ సినిమా ఇండియన్ సినీ చరిత్రలో నిలిచి పోయే సినిమా అవుతుందని అంటున్నారు.పాతిక దేశాల్లో పాతిక భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఇండియన్‌ సినిమా గురించి హాలీవుడ్‌ వారు మాట్లాడుకునే విధంగా ఈ సినిమా ఉంటుందని మేకర్స్ నమ్మకంగా చెబుతున్నారు.

రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?
Advertisement

తాజా వార్తలు