ఆ హీరోకి చరణ్ తో పోటి ఎందుకో ...

నాగచైతన్య సినిమాల్లోకి వచ్చి చాలాకాలమైనా, ఇప్పటికి తనకంటూ ఒక ఫాలోయింగ్ క్రియేట్ చేసుకోలేకపోయాడు.

క్లాస్ బాట పట్టడం వలన కావచ్చు, తీసిన ఒకటిరెండు మాస్ సినిమాలు బోల్తా పడటం వలన కావచ్చు .

చైతు బాక్సాఫీస్ గేమ్ దగ్గర పెద్ద ఆటగాడిగా ఎదగలేదు.మరోవైపు రామ్ చరణ్ ఇందుకు పూర్తిగా భిన్నం.

తొలిచిత్రం చిరుత తోనే తన భవిష్యత్తు ఎలా ఉండబోతోందో చెప్పేసాడు.రెండో సినిమానే రాజమౌళితో తీయడంతో చరణ్ మాస్ ఫాలోయింగ్ రాత్రికి రాత్రే మరో లెవెల్ కి వెళ్ళిపోయింది.

చరణ్ కి బాక్సాఫీస్ పుల్ చాలా ఉంది.తనకి మంచి కథ ఉన్న సినిమా పడితే చాలు, రికార్డుల రేసులోకి మళ్ళీ వచ్చేస్తాడు.

Advertisement

కాని నాగచైతన్య పరిస్థితి అలా కాదు.హిట్ల మీద హిట్లు పడితే తప్ప, ఒక బ్రాండ్ గా ఎదగడం కష్టం.

ఇలాంటి పరిస్థితులలో, నాగార్జున తనయుడు, చిరు తనయుడితో పోటిపడటం కాస్త రిస్కి వ్యవహారమే.ఇంతకి ఏం పోటి అని అనుకుంటున్నారా ? అయ్యో .అసలు మ్యాటర్ ఇంకా చెప్పలేదు కదా.అక్టోబరు 7న ధృవ చిత్రం విడుదల అవుతోంటే, అక్టోబర్ 8న ప్రేమమ్ విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు