Rakul Preeth Singh: కోలీవుడ్ హీరోతో రకుల్ ప్రేమాయణం.. అందుకే ఖరీదైన కారు కొనిచ్చాడా..?

గత కొన్ని రోజులుగా రకుల్ ప్రీత్ సింగ్ ( Rakul Preeth Singh ) టాలీవుడ్ లో కనిపించడం లేదు.

ఈమె కేవలం తెలుగులోనే కాకుండా కన్నడ,తమిళ,హిందీ భాషల్లో కూడా నటించింది.

ఇక మొదటిసారి రకుల్ ప్రీత్ సింగ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది కన్నడ సినిమాతోనే.పాకెట్ మనీ కోసం కన్నడ సినిమాలో హీరోయిన్ గా చేసిందట రకుల్ ప్రీత్ సింగ్.

ఇక అప్పటికి రకుల్ ప్రీత్ సింగ్ కేవలం ఇంటర్ మాత్రమే పూర్తిచేసిందట.ఇక ఈ సినిమా తర్వాత డిగ్రీ పూర్తి చేసి మళ్లీ టాలీవుడ్ లో కెరటం ( Keratam ) అనే మూవీ ద్వారా ఎంట్రీ ఇచ్చింది.

మొదటి సినిమా అంతగా హిట్ ఇవ్వనప్పటికీ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ( Venkatadri Express ) సినిమా రకుల్ ప్రీత్ సింగ్ ని టాలీవుడ్ లో ఫేమస్ చేసింది.అలా వరుసగా ధ్రువ, నాన్నకు ప్రేమతో రారండోయ్ వేడుక చూద్దాం, కొండ పొలం,లౌక్యం, పండగ చేసుకో, విన్నర్,బ్రూస్ లీ వంటి సినిమాల్లో నటించింది.ఇక ఈమె చివరిగా నాగార్జునతో కలిసి మన్మధుడు 2, వైష్ణవ్ తేజ్ తో కొండ పొలం ( Kondapolam ) వంటి సినిమాల్లో చేసింది.

Advertisement

ఈ సినిమా తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ కు తెలుగులో అవకాశాలు రాలేదు.దాంతో బాలీవుడ్ కి చెక్కేసింది.అక్కడ కూడా వరుస సినిమాల్లో నటించింది.

అయితే బాలీవుడ్లో ప్రొడ్యూసర్ కం హీరో అయిన జాకీ భగ్నాని ( Jacky bhagnani ) తో రకుల్ ప్రీత్ సింగ్ లవ్ ట్రాక్ నడిపింది.అంతే కాదు వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు కూడా సమాచారం.

అయితే ఈ విషయం పక్కన పెడితే రకుల్ ప్రీత్ సింగ్ ( Rakul Preeth Singh ) ఈ మధ్యకాలంలో ఒక కోలీవుడ్ హీరో తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నట్టు కోలీవుడ్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతుంది.అంతేకాదు ఆ హీరో రకుల్ ప్రీత్ సింగ్ పై ఉన్న ప్రేమతో మూడు కోట్ల విలువ చేసే ఖరీదైన కారును కూడా గిఫ్ట్ గా ఇచ్చినట్లు తెలుస్తోంది.ఇక ఈ మధ్యకాలంలోనే రకుల్ ప్రీత్ సింగ్ తాను కొన్న కారుతో ఉన్న ఫోటోలు నెట్టింట్లో చక్కర్లు కొట్టిన సంగతి మనకు తెలిసిందే.

అయితే ఆ కారు ఆ కొలీవుడ్ హీరోనే కొనిచ్చారు అంటూ కోలీవుడ్ మీడియాలో వార్తలు రావడంతో రకుల్ ప్రీత్ సింగ్ తో ఆ హీరో వ్యవహారం చాలా దూరం వెళ్ళింది కదా అని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు.

'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా ను ఆ హీరోతో చేయాల్సిందా..?
Advertisement

తాజా వార్తలు