రజనీకాంత్ రాజకీయాలలోకి వచ్చిన ఎలాంటి ప్రయోజనం లేదు: రజిని సోదరుడు

సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రెటీలు అందరూ కూడా అనంతరం రాజకీయాలలోకి రావడం మనం చూస్తున్నాము.

ఇలా ఇప్పటికే ఎంతోమంది సినీ సెలెబ్రెటీలు రాజకీయాలలో కొనసాగుతూ రాజకీయాలలో కూడా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.

ఈ క్రమంలోనే కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) సైతం రాజకీయాలలోకి రాబోతున్నారంటూ గతంలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.అయితే ఈయన తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారని కూడా తెలుస్తుంది.

రజనీకాంత్ రాజకీయాల(Politics) లోకి రావాలని ఆసక్తి ఉన్నప్పటికీ కేవలం ఆయన ఆరోగ్యం సహకరించకపోవడంతో రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.

ఇక రజనీకాంత్ రాజకీయాలకు దూరంగా ఉన్న ఏదో ఒక పార్టీకి మద్దతు తెలుపుతారని అందరూ భావించారు.అయితే తాజాగా రజనీకాంత్ రాజకీయ జీవితం గురించి ఆయన సోదరుడు సత్యనారాయణ(Satyanarayana) చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.సత్యనారాయణ తిరుచెందూర్ కుమారస్వామి ఆలయాన్ని సందర్శించారు.

Advertisement

ఈ క్రమంలోనే స్వామివారి దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన ఈయన రజనీకాంత్ రాజకీయాల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

రజనీకాంత్ రాజకీయాలలోకి రారని,ఆయన రాజకీయాలలోకి వచ్చిన ఎవరికి ఎలాంటి ప్రయోజనం లేదని ఈయన వెల్లడించారు.ఇలా రజనీకాంత్ రాజకీయాలలోకి వచ్చిన ఎలాంటి ఉపయోగం లేదు అన్న విషయానికి కూడా ఈయన వివరణ ఇచ్చారు.రజనీకాంత్ ప్రస్తుతం ఏడుపదుల వయసులో ఉన్నారు.

ఇలాంటి సమయంలో ఆయన రాజకీయాలలోకి వచ్చిన ఏ విధమైనటువంటి ప్రయోజనం లేదని ఆ భగవంతుడి దయవల్ల ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటే చాలని సత్యనారాయణ తెలిపారు.ఇక రాజకీయాలలోకి రావాలనే ఆలోచన విరమించుకున్న రజినీకాంత్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

ఇక రజిని ప్రధాన పాత్రలో ప్రేక్షకులు ముందుకు రాబోతున్న చిత్రం జైలర్ (Jailer) ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులను జరుపుకుంటుంది.

రూ.10 లక్షల విరాళం ప్రకటించినా రష్మికపై ట్రోల్స్.. అలా చేయడమే తప్పైందా?
Advertisement

తాజా వార్తలు