బైక్ ను ఢీ కొట్టిన రాజధాని ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్.. క్షణాల్లోనే నుజ్జునుజ్జు.. వీడియో వైరల్!

ఈ రోజుల్లో చాలామంది అతి నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తున్నారు.ముఖ్యంగా 80% బైక్ రైడర్లు ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా రోడ్లపై ఇష్టారాజ్యంగా తిరిగేస్తున్నారు.

ఇలాంటి రైడింగ్‌ల వల్ల వీళ్లు మాత్రమే కాదు ఇతర వాహనదారులు కూడా ఇబ్బందులు పడుతున్నారు.కొన్ని ఘటనల్లో ప్రాణాలు కూడా పోతున్నాయి.

జాగ్రత్తగా రైడింగ్ చేయకపోతే ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని ట్రాఫిక్ పోలీసులు ఎల్లప్పుడూ హెచ్చరిస్తూనే ఉన్నారు.సోషల్ మీడియాలో కూడా నిర్లక్ష్యంగా రైడింగ్ చేసి ప్రాణాలు కోల్పోయిన బైకర్‌ల గురించి ఎన్నో వీడియోలు వైరల్ అయ్యాయి.

వీటిని చూసి అయినా వాహనదారులు నేర్చుకుంటారా అంటే అదీ లేదు.తాజాగా బైక్ ఎలా నడపకూడదో చెప్పడానికి మరొక ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది.

Advertisement

దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.

వైరల్ అవుతున్న వీడియోలో ఒక బైకర్‌ రైల్వే గేటు వద్ద రైలు పట్టాలు దాటుతున్నట్లు చూడొచ్చు.అతడు చాలా స్లోగా బైకును రైల్వే ట్రాక్ పై నడుపుతున్నాడు.

అక్కడే ఉన్న జనాలు ట్రైన్ అటువైపు నుంచి వస్తుందని కదలకుండా అలాగే వేచి చూస్తున్నారు.బైకర్‌ మాత్రం అవేమీ పట్టించుకోకుండా పూర్తి నిర్లక్ష్యంతో బైక్ ని నడిపాడు.

అదే సమయంలో అతివేగంగా రైలు దూసుకొచ్చింది.అయితే ట్రైన్ తనని ఢీకొట్టబోతోందని గ్రహించిన సదరు బైకర్ వెంటనే అప్రమత్తమయ్యాడు.

రెండు స్పూన్ల బియ్యంతో హెయిర్ ఫాల్ దూరం.. ఎలా వాడాలంటే?
కుంభమేళాలో ఘోరం.. ప్రశ్నించినందుకు యూట్యూబర్‌ని చితక్కొట్టిన సాధువు.. వీడియో లీక్!

మిల్లీ సెకన్లలో బైక్ పై నుంచి దూకి తప్పించుకున్నాడు.ఇంతలోనే రైలు అతని బైక్ ని నుజ్జునుజ్జు చేస్తూ దూసుకెళ్లింది.

Advertisement

దృశ్యాలు ఒళ్లు గగుర్పొడిచేలా కనిపించాయి.మిల్లీ సెకన్ల సమయం ఆలస్యం చేసినా ఈ బైకర్‌ శరీరం తునాతునకలు అయ్యేది.

కానీ అదృష్టం కొద్దీ అతడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.

రైలు ఢీకొని తప్పించుకున్న బైకర్‌కు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.దీన్ని ఓ ట్విట్టర్ యూజర్ షేర్ చేశారు.ఫిబ్రవరి 12న సాయంత్రం సమయంలో ఈ ఘటన జరిగినట్లు వీడియోలోని టైమ్ స్టాంప్ ద్వారా తెలుస్తోంది.

రైలు రాజధాని ఎక్స్‌ప్రెస్ కాగా ఈ సంఘటన ముంబైలో జరిగిందని సమాచారం.

తాజా వార్తలు