‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విడుదల విషయంలో జక్కన్న మాస్టర్‌ ప్లాన్‌ అదిరింది

రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం విడుదల విషయంలో గత కొన్ని రోజులుగా ఉత్కంఠభరితంగా చర్చ జరుగుతోంది.

చాలా రోజులుగా సినిమాను జులై 30న విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా చెప్పారు.

కాని ఆ తేదీన సినిమాను విడుదల చేయడం అసాధ్యం అంటూ జనవరి 8న సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు.ఖచ్చితంగా సంక్రాంతికి వస్తుందిలే అనుకుంటున్న సమయంలో కరోనా మహమ్మారి వచ్చింది.

దాదాపుగా నెలన్నర లాక్‌డౌన్‌తో షూటింగ్‌ రెండు నెలలు ఆగిపోయింది.లాక్‌డౌన్‌ అయినా కూడా షూటింగ్‌ అనుకున్న సమయంకు పూర్తి చేసి సినిమాను విడుదల చేస్తామంటూ దానయ్య గతంలో పేర్కొన్నాడు.

అయితే రాజమౌళి మాత్రం ప్లాన్‌ బి ని కూడా రెడీగా ఉంచుకుంటున్నట్లుగా సమాచారం అందుతోంది.సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం విడుదల విషయంలో ద్విముఖ వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్లుగా చెబుతున్నారు.

Advertisement

అన్ని అనుకున్నట్లుగా జరిగి దేశంలో కరోనా పూర్తిగా వెళ్లిపోతే జనవరి 8న విడుదల చేయబోతున్నాడు.

ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంను కేవలం ఇండియాలోనే కాకుండా అమెరికాతో పాటు పలు ప్రపంచ దేశాల్లో విడుదల చేయాలనుకుంటున్నారు కనుక మొత్తం కరోనా వైరస్‌ లేకుండా పోయిన సమయంలో వ్యాక్సిన్‌ వచ్చిన తర్వాత సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు.అది ఎప్పుడు అయితే అప్పుడు అన్నట్లుగా రాజమౌళి ప్రయత్నాలు చేస్తున్నాడు.అయితే విడుదల ఎప్పుడైనా కానివ్వు కాని ఈ ఏడాది నవంబర్‌ లేదా డిసెంబర్‌ వరకు సినిమాను పూర్తి చేసి ఫస్ట్‌ కాపీని రెడీ చేయాలని జక్కన్న భావిస్తున్నాడు.

పూర్తి అయిన తర్వాత వీలు ఉన్నప్పుడు.అంతా బాగున్నప్పుడు విడుదల చేయాలని రాజమౌళి మాస్టర్‌ ప్లాన్‌ వేశాడట.

వీడియో వైరల్ : మూఢనమ్మకంతో చనిపోయిన వ్యక్తిని నీటిలో వేలాడదీసిన గ్రామ ప్రజలు.. చివరకు..?!
Advertisement

తాజా వార్తలు