ఆర్ఆర్ఆర్ బడ్జెట్ పూర్తి వివరాలు.. ఇన్ని కోట్లు అయ్యిందని మనం అసలు ఊహించలేం..

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ సినిమా ఆర్ఆర్ఆర్.ఈ సినిమాను టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా తెరకెక్కించాడు.

ఇందులో టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించారు.ఇందులో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుంటే.

ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తున్నాడు.ఈ సినిమాలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్, అజయ్ దేవగణ్ కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

అయితే ఈ సినిమా విడుదల చేయాలనీ చూసినప్పుడల్లా ఏదొక సమస్య వస్తూనే ఉంది.పలు వాయిదాల తర్వాత ఎట్టకేలకు ఈ సినిమా మార్చి 25న రిలీజ్ కానుందని ఇటీవలే ప్రకటించారు.

Advertisement
Rajamouli Ram Charan Ntr Rrr Movie Budget 336 Crores Details, , Ntr,rajamouli,Ra

డివివి దానయ్య ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించిన విషయం తెలిసిందే.అయితే భారీ బడ్జెట్ అని చెప్పుకోవడమే కానీ ఇంత అని తెలియదు.

అయితే తాజాగా ఆంద్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ పేర్ని నాని ఈ సినిమా బడ్జెట్ ఎంతో చెప్పేసాడు.

Rajamouli Ram Charan Ntr Rrr Movie Budget 336 Crores Details, , Ntr,rajamouli,ra

ఈయన అంత ఖచ్చితంగా ఎలా చెప్పాడంటే రాజమౌళి టికెట్ వ్యవహారం అప్పుడు ఆయనకు బడ్జెట్ ఎంతో చెప్పి ఆయన సలహా కోరారు.అందుకే ఏపీ ప్రభుత్వం బడ్జెట్ వివరాలు చూసి 100 రూపాయలు పెంచుకోవచ్చని చెప్పింది.

Rajamouli Ram Charan Ntr Rrr Movie Budget 336 Crores Details, , Ntr,rajamouli,ra

ఇంతకీ పేర్ని నాని ఈ సినిమా బడ్జెట్ ఎంత చెప్పాడంటే.అక్షరాలా 336 కోట్లట. అది కూడా రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్, ఆలియా రెమ్యునరేషన్ కాకుండానే.

ఇదేం కాంప్లిమెంట్ రా బాబోయ్.. పొగిడినట్టే పొగిడి భారతీయులను అవమానించిన ఆస్ట్రేలియా కపుల్..
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 26, శుక్రవారం 2023

ఇది విన్న అందరు షాక్ అవుతున్నారు.ఈ విషయం బయటకు రావడంతో మళ్ళీ ఎవరికీ తోచిన రెమ్యునరేషన్స్ వారు చెబుతున్నారు.

Advertisement

అయితే ఈ బడ్జెట్ 336 కోట్లకి వీరి రెమ్యునరేషన్స్ కలిపి మరొక 200 కోట్లు అని కొందరు అంటుంటే మరికొందరు మూడు వందల కోట్లు అని చెప్పుకొస్తున్నారు.ఈ లెక్కలు ఎలా ఉన్న విడుదల అయితే ఈ లెక్కలన్నీ మార్చేస్తుంది అనే ధీమా మేకర్స్ లో కనిపిస్తుంది.

తాజా వార్తలు