మహేష్ తో చేసే సినిమాలో ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ ని ప్లాన్ చేస్తున్న రాజమౌళి...

ప్రస్తుతం ఇండియాలోనే స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందుతున్న రాజమౌళి( Rajamouli ) మహేష్ బాబుతో చేయబోయే సినిమా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

ఇక ఇప్పటికే ఈ సినిమా రైటర్ అయిన విజయేంద్రప్రసాద్( Vijayendra Prasad ) ఈ సినిమా ఇండియానా జోన్స్ కి ఇన్స్పిరేషన్ తో తెరకెక్కుతుంది అనే ఒక హింట్ అయితే ఇచ్చారు.

ఇక దాని ప్రకారం చూసుకున్న ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ కి కొదవలేదనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది.ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో పాన్ వరల్డ్ లో లేనివిధంగా ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ని ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఇప్పటివరకు ఇలాంటి యాక్షన్ సీక్వెన్స్ ఏ సినిమాలో కూడా రాని విధంగా తీర్చిదిద్దబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.ఇక దానికోసమే ప్రముఖ హాలీవుడ్( Hollywood ) టెక్నీషియన్లు అందరిని తీసుకోబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.ఇక దీన్ని చాలా ప్రెస్టేజీయస్ గా తీసుకున్న రాజమౌళి ఎలాగైనా సరే ఈ సినిమాతో పాన్ వరల్డ్ లోనే ది బెస్ట్ డైరెక్టర్ అని ప్రూవ్ చేసుకోవాలనే కాన్సెప్ట్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది.

మరి ఈ సినిమాతో తను అనుకున్నట్టుగా పాన్ వరల్డ్ లో తను ఒక స్టార్ డైరెక్టర్ గా వెలుగొందు తాడా లేదా అనే విషయం తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.ఇక ఇప్పటికే ఈ సినిమాతో రాజమౌళి వండర్స్ చేస్తాడు అని చాలా మంది ఇండియన్ అభిమానులు ఈ సినిమా కోసం విపరీతంగా ఎదురుచూస్తున్నారు.ఇక దానికి తోడు గా ఆయన ఈ సినిమా గురించి ఇచ్చే హింట్స్ కూడా అభిమానులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది.

Advertisement

ఇక మొత్తానికైతే తొందర్లోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళబోతుంది.

కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?
Advertisement

తాజా వార్తలు