రిపబ్లిక్ డేకు 'ఆర్ఆర్‌ఆర్‌' నుండి వచ్చే సర్‌ ప్రైజ్ ఏంటో తెలుసా?

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ఆర్‌ఆర్‌ సినిమా చిత్రీకరణ విషయంలో అనేక అడ్డంకులు అవరోధాలు వస్తూనే ఉన్నాయి.

షూటింగ్‌ ప్రారంభం సమయంలో ఒక సారి ఎన్టీఆర్‌ కు ఒక సారి చరణ్‌ కు గాయాలు అయినట్లుగా వార్తలు వచ్చాయి.

ఆ గాయాల కారనంగా దాదాపుగా మూడు నెలల పాటు షూటింగ్ వాయిదా పడింది.ఇక నటీ నటుల డేట్లు క్లాష్ అవ్వడం వల్ల మళ్లీ సినిమా రెండు మూడు నెలల పాటు వాయిదాలు పడుతూ వచ్చింది.

ఇక కరోనా కారణంగా ఏకంగా ఏడు ఎనిమిది నెలల పాటు షూటింగ్ లేకుండా గడిపేశారు.కనీసం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ ను కూడా నిర్వహించలేదు.

మళ్లీ ఇన్నాళ్లకు వర్క్‌ ఫుల్ స్వింగ్ లో జరుగుతోంది.ఈ సినిమా స్వాతంత్ర్యంకు పూర్వం కథతో రూపొందిస్తున్నారు.

Advertisement

దానికి తోడు కొమురం భీమ్‌ మరియు అల్లూరి పాత్రలతో సినిమాను తీస్తున్నాడు.కనుక రిపబ్లిక్ డే సందర్బంగా ఏదో ఒక సర్‌ప్రైజ్ ను జనాలు ఆశించడం ఖాయం.

జక్కన్న కూడా అందుకు సిద్దంగా ఉన్నాడు.భారీ ప్లానింగ్స్ ఏమీ లేవు కాని సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా విడుదల తేదీతో పాటు టీజర్ కు సంబంధించిన అప్ డేట్‌ ను కూడా ఇచ్చే అవకాశం ఉంది.ఇదే సమయంలో క్లైమాక్స్‌ ఫైట్‌ షూటింగ్ కు సంబంధించిన ఒక చిన్న బిట్ వీడియోను లేదా పోస్టర్‌ ను కూడా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

ప్రస్తుతం జక్కన్న అండ్ టీం ఆ పనిలోనే ఉన్నారు అంటూ సమాచారం అందుతోంది.భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమాను అక్టోబర్‌ లో విడుదల చేయబోతున్నారట.ఆ విషయం ఇప్పటికే లీక్‌ అయ్యింది.

దాన్నే రిపబ్లిక్ డే సందర్బంగా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది అంటున్నారు.

తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?
Advertisement

తాజా వార్తలు