సోదరుడికి రాఖీ కట్టి కిడ్నీ దానానికి సిద్ధమైన అక్క.. ఈ మహిళ నిజంగా గ్రేట్ అంటూ?

దేశంలోని అన్ని ప్రాంతాల్లో నిన్న, ఈరోజు రక్షా బంధన్ పండుగను గ్రాండ్ గా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.

రాఖీ పండుగ సందర్భంగా ఒక అక్క కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల బాధ పడుతున్న తమ్ముడికి రాఖీ కట్టడానికి సిద్ధం కావడంతో పాటు సోదరుడికి రాఖీ కట్టి కిడ్నీ( Kidney ) దానానికి సిద్ధమైంది.

తమ్ముడు కోలుకోవడం కోసం కిడ్నీ దానం చేస్తున్నట్టు మహిళ చేసిన కీలక ప్రకటన సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని రాయ్ పూర్ నగరానికి చెందిన ఓం ప్రకాశ్ ధన్ గర్ ( Om Prakash Dhan Gar )కు 2022 సంవత్సరం మే నెలలో కిడ్నీ దెబ్బతింది.

కిడ్నీ సంబంధిత సమస్యల వల్ల ఓం ప్రకాశ్ ధన్ గర్ తరచూ డయాలసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.రెండు కిడ్నీలు క్షీణించడంతో కిడ్నీ మార్పిడి చేయించుకోవాలని వైద్యులు సూచించారు.

అలా చేయని పక్షంలో ప్రాణాలకే ప్రమాదమని వాళ్లు చెప్పుకొచ్చారు.

Raipur Woman Raksha Bandhan Gift To Brother Details Here Goes Viral , Raipur Wom
Advertisement
Raipur Woman Raksha Bandhan Gift To Brother Details Here Goes Viral , Raipur Wom

నడియాడ్ ప్రాంతంలోని( Nadiad region ) ఒక ఆస్పత్రిని ఓం ప్రకాశ్ కుటుంబ సభ్యులు సందర్శించగా అక్కడి వైద్యులు సైతం కిడ్నీ మార్పిడి చేయించుకుంటే మంచిదని సూచించారు.తమ్ముడి ఆరోగ్య స్థితి గురించి తెలిసిన అక్క సుశీలాబాయ్ ( Sushilabai )తమ్ముడికి కిడ్నీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.వైద్యులు సైతం ఆమె కిడ్నీ తమ్ముడికి సరిపోతుందని వెల్లడించారు.

సెప్టెంబర్ నెల 3వ తేదీన కిడ్నీ మార్పిడి ఆపరేషన్ జరగనుంది.

Raipur Woman Raksha Bandhan Gift To Brother Details Here Goes Viral , Raipur Wom

సుశీలా బాయ్ నిజంగా గ్రేట్ అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.తన సోదరుడు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించాలనే ఆలోచనతో సుశీలా బాయ్ ఈ నిర్ణయం తీసుకున్నారు.తమ్ముడిపై ఉండే ప్రేమ వల్లే తాను కిడ్నీ దానానికి సిద్ధమయ్యానని సుశీలా బాయ్ చెబుతున్నారు.

సుశీలా బాయ్, ఓం ప్రకాశ్ లకు అంతా మంచి జరగాలని నెటిజన్లు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.

మలబద్ధకాన్ని తరిమికొట్టే బెస్ట్ డ్రింక్స్ ఇవి.. రోజు తీసుకుంటే మరెన్నో లాభాలు!
Advertisement

తాజా వార్తలు