లఖింపూర్ పర్యటనకు సిద్ధమైన రాహుల్ గాంధీ..!!

యూపీలో లఖింపూర్ లో రైతులని  కేంద్ర మంత్రి కొడుకు కాన్వాయ్ తో ఢీ కొనడంతో రైతులు చనిపోవడంతో ఈ వార్త ఉత్తరప్రదేశ్ రాజకీయాలతో పాటు జాతీయ రాజకీయాలను కుదిపేస్తోంది.

పైగా వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.

లఖింపూర్ రైతుల మరణ వార్త ఘటన బిజెపి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టినట్లు అయింది.ఈ తరుణంలో రైతులను పరామర్శించడానికి ప్రారంభంలో ప్రియాంక గాంధీ రెడీ  కాగా ఆమెను యూపీ పోలీసులు అరెస్టు చేశారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు తాజాగా రాహుల్ పర్యటనకు యూపీ హోం శాఖ అనుమతి ఇవ్వడం జరిగింది.ఒక రాహుల్ కి మాత్రమే కాకప్రియాంక గాంధీకి అదే రీతిలో మరో ముగ్గురికి అనుమతులు ఇవ్వడం జరిగింది.

ఈ తరుణంలో ఇప్పటికే పర్యటనకు రెడీ అయిన రాహుల్ గాంధీ.కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Advertisement

ఒక పద్ధతి ప్రకారం కేంద్ర ప్రభుత్వం రైతుల పై దాడులు చేస్తుందని ఆరోపించారు.రైతులపై జీపు ఎక్కించి హత్య చేశారని ఈ క్రమంలో హత్య చేసిన కేంద్ర మంత్రి కొడుకు ఎందుకు ఇంత వరకు అరెస్టు చేయలేదని రాహుల్ గాంధీ ప్రభుత్వాలపై సీరియస్ అయ్యారు.

లక్నో పర్యటన చేపట్టిన మోడీకి రైతులను పరామర్శించే సమయం లేదా అని విమర్శించారు.ఇటువంటి తరుణంలో లఖింపూర్ కి.మరికాసేపట్లో చేరుకుని రాహుల్గాంధీ రైతులను పరామర్శించినున్నారు.

Advertisement

తాజా వార్తలు