పరువు నష్టం కేసుకు సంబంధించి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ రోజు ముంబై లోని మెట్రోపాలిటన్ కోర్టు లో హాజరైన సంగతి తెలిసిందే.గౌరీ లంకేశ్ హత్య కేసులో బీజేపీ,ఆర్ ఎస్ ఎస్ లకు సంబంధం ఉందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు అన్న నేపథ్యంలో రాహుల్ పై పరువునష్టం దావా వేశాయి.
దీనీతో ఈ కేసు విచారణ నిమిత్తం ఈ రోజు ముంబై లోని కోర్టు ముందు హాజరై విచారణ ఎదుర్కొన్నారు.అయితే ఇరు పక్షలా వాదనలు విన్న ముంబై కోర్టు రాహుల్ కు రూ.15 వేల పూచికత్తు తో కూడిన బెయిల్ మంజూరు చేసినట్లు తెలుస్తుంది.దీనితో రాహుల్ కు పరువునష్టం కేసులో ఊరట లభించింది.
మాజీ ఎంపీ ఏక్‌నాథ్ గైక్వాడ్ రాహుల్ గాంధీకి షూరిటీ ఇచ్చారు.

ప్రముఖ జర్నలిస్టు గౌరీలంకేష్ హత్య నేపథ్యంలో ‘బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై ఒత్తిడి పెరుగుతుంది.దాడులు కూడా జరుగుతాయి.హత్యకు కూడా గురవుతారు’ అని అంటూ రాహుల్ వ్యాఖ్యానించడం వివాదాస్పదంగా మారింది.
ఈ క్రమంలో ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ ధ్రుతిమన్ జోషి అనే ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త పరువు నష్టం దావా వేశారు.దీనితో రాహుల్ ఈ పిటీషన్ విచారణకు హాజరై నేను ఏ తప్పు చేయలేదు అంటూ కోర్టు కు విన్నవించుకోవడం తో రాహుల్ కు ఈ కేసు నుంచి విముక్తి లభించింది.