సంజయ్ కు ప్రత్యర్ధిని సిద్దం చేసిన కాంగ్రెస్ ? 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటుకున్న కాంగ్రెస్ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల పైన దృష్టి సారించింది.

మరికొద్ది నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు రాబోతూ ఉండడం తో మెజారిటీ స్థానాలను తమ ఖాతాలో వేసుకోవాలి అనే పట్టుదలతో ఉంది.

దీనిలో భాగంగానే అన్ని పార్లమెంట్ స్థానాల్లోనూ బలమైన అభ్యర్థులను పోటీకి దించేందుకు కసరత్తు మొదలు పెట్టింది.రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో వీలైనంత ఎక్కువ ఎంపీ సీట్లు గెలిచి మరోసారి బీఆర్ఎస్ , బీజీపీ లకు  అవకాశం లేకుండా చేయాలి అనే పట్టుదలతో ఉంది.

  దీనిలో భాగంగానే బిజెపి బీఆర్ఎస్ నుంచి పోటీకి దిగబోతున్న కీలక నేతలను టార్గెట్గా చేసుకుని ఆయా నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను పోటీకి దింపేందుకు అప్పుడే వేట మొదలు పెట్టింది.

 ముఖ్యంగా తెలంగాణ బిజెపి మాజీ అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్( Bandi Sanjay ) కరీంనగర్ నుంచి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నారు.ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓటమి చెందారు.వచ్చే ఎన్నికల్లో మళ్ళీ కరీంనగర్ నుంచి ఎంపీగా పోటీ చేసే ఆలోచనతో ఉన్నారు.

Advertisement

దీంతో ఆ స్థానంలో కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డిని పోటీకి దించాలని కాంగ్రెస్ భావిస్తోంది.ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జీవన్ రెడ్డి జగిత్యాల నుంచి  ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందారు.

అయితే ఆయన ఓడినా,  కాంగ్రెస్ పరపతి పెంచే విధంగా వ్యవహరిస్తుండడం,  ప్రత్యర్థుల విమర్శలను తిప్పుకొడుతూ యాక్టివ్ గా ఉండడంతో కరీంనగర్ ఎంపీగా జీవన్ రెడ్డిని పోటీకి దించాలని కాంగ్రెస్ భావిస్తోందట.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీ స్థానం పరిధిలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు .దీంతో జీవన్ రెడ్డిని(Jeevan Reddy ) ఇక్కడ నుంచి పోటీకి దింపితే ఫలితం ఆశా జనకంగా ఉంటుంది అని అంచనా వేస్తున్నారు.దీనికి తోడు ఈ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో గెలిచిన ఎమ్మెల్యేలంతా జీవన్ రెడ్డిని పోటీకి దించాలని కోరుతూ ఉండడంతో ఆయన వైపే అధిష్టానం మొగ్గు చూపుతోంది.

ఇక బిజెపి నుంచి బండి సంజయ్ మళ్లీ పోటీ చేయబోతున్నారు.బీఆర్ఎస్  నుంచి వినోద్ కుమార్( Vinod Kumar ) పోటీ చేసే అవకాశం ఉంది .

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు