మేడ్ ఇన్ ఇండియా అంటోన్న పుష్ప

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రీసెంట్ మూవీ అల వైకుంఠపురములో సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.

ఈ సినిమాతో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడు.

త్రివిక్రమ్ టేకింగ్‌కు బన్నీ యాక్టింగ్ తోడుకావడంతో ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.ప్రేక్షకులను మెప్పించిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ మూవీగా నిలవడంతో, బన్నీ తన నెక్ట్స్ మూవీని వెంటనే స్టార్ట్ చేశాడు.

Pushpa Movie To Be A Made In India Film, Pushpa, Allu Arjun, Sukumar, Made In In

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ముచ్చటగా మూడోసారి బన్నీ చేస్తున్న సినిమాకు చిత్ర యూనిట్ ‘పుష్ప’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు.ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటేందుకు బన్నీ రెడీ అవుతున్నాడు.

పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను సుకుమార్ తీర్చిదిద్దుతున్నాడు.కాగా ఈ సినిమా కోసం ఒక్క ఫారిన్ టెక్నీషియన్‌ను కూడా వాడటం లేదట సుకుమార్ అండ్ టీమ్.

Advertisement

ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఈ సినిమా షూటింగ్‌ను పూర్తిగా ఇండియాలోనే తెరకెక్కించాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.ఈ లెక్కన పుష్ప సినిమా పూర్తిగా మేడ్ ఇన్ ఇండియా సినిమా ముద్రను వేసుకోవడం ఖాయమని అంటున్నారు చిత్ర యూనిట్.

ఫారిన్ లొకేషన్లు, ఇతర దేశాల టెక్నీషియన్స్ లేకపోవడంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.ఇక ఈ సినిమాలో బన్నీ ఓ లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తుండగా, అందాల భామ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది.

ఈ సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వరగా తిరిగి ప్రారంభించాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

కోర్ట్ సినిమా డైరెక్టర్ కు ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన నాని.. ఈ నిర్ణయాన్ని మెచ్చుకోవాల్సిందే!
Advertisement

తాజా వార్తలు