Pushpa : ఇది కదా పుష్ప గాడి రేంజ్.. ఆ హక్కుల కోసం ఏకంగా ఈ రేంజ్ లో పోటీ ఉందా?

టాలీవుడ్ పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్,( Allu Arjun ) కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం పుష్ప.

( Pushpa )2021 లో విడుదలైన ఈ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.

బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకోవడంతో పాటు కోట్లల్లో కలెక్షన్స్ ను రాబట్టింది.అంతే కాకుండా ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనకు గాను ఇటీవలే ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును కూడా అందుకున్నారు.

ఇక పోతే పుష్ప పార్ట్ 1 బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో పుష్ప 2 సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

కాగా ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 ( Pushpa 2 movie )లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది.

Advertisement

దాంతో ఈ సినిమాపై ఉన్న క్రేజ్ తో ఈ మూవీ డిజిటల్ హక్కుల కోసం తీవ్ర పోటీ ఏర్పడినట్లుగా తెలుస్తోంది.ప్రముఖ ఓటిటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ పుష్ప ద రూల్ ఓటిటీ హక్కుల కోసం ట్రై చేస్తుందట.

రికార్డ్ ప్రైస్ ని పుష్ప 2 కోసం కోట్ చేసినట్లుగా చెబుతున్నారు.ప్రస్తుతం ఓటిటీ దిగ్గజాల్లో నెంబర్ 1 పొజిషన్ లో ఉన్న నెట్ ఫ్లిక్స్ కే పుష్ప 2 రైట్స్ సొంతమవుతాయని అంటున్నారు.

కాగా ఇక ఆగష్టు 15, 2024 న విడుదల తేదిని లాక్ చేసిన పుష్ప మూవీ ( Pushpa 2 movie )మేకర్స్ చాలా తెలివైనవారంటూ పలువురు ప్రశంసిస్తున్నారు.ఎందుకంటే ఆ తేదీ కి వచ్చే పుష్ప 2 కి వరసగా నాలుగు రోజుల లాంగ్ వీకెండ్ కలిసిరానుంది అని, వారాంతంలో బాక్సాఫీసు ని పుష్ప 2 చెడుగుడు ఆడేస్తుంది అంటున్నారు.ఇన్ని విషయాలు కలిసి ఉండడంతో పుష్ప 2 సినిమాను కొనుగోలు చేయడానికి ఓటీటీ రైట్స్ ని పోటీ పడుతున్నారట.

వైసీపీ కార్యాలయం కూల్చివేత పై జగన్ ఏమన్నారంటే ? 
Advertisement

తాజా వార్తలు