భారత సంతతి ఎంపీకి చేదు అనుభవం.. చెకింగ్ పేరిట 2 గంటల పాటు ఎయిర్‌పోర్ట్‌లోనే

పంజాబీ సంతతికి చెందిన బ్రిటీష్ ఎంపీ తన్మన్ జిత్ సింగ్ ధేసీని ( MP Tanman Jit Singh Dhesini )ఇమ్మిగ్రేషన్ అధికారులు గురువారం ఉదయం అమృత్‌సర్ విమానాశ్రయంలో రెండు గంటల పాటు అడ్డుకోవడం కలకలం రేపుతోంది.

గురువారం ఉదయం 9 గంటలకు బర్మింగ్‌హామ్( Birmingham ) నుంచి ఎయిరిండియా విమానంలో (AI-118)లో ఆయన అమృత్‌సర్ చేరుకున్నాడు.

మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం.ధేసీకి ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా( Overseas Citizen of India ) (ఓసీఐ) కార్డ్ లేదు.

ఈ నేపథ్యంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు అతడిని విమానాశ్రయంలో అడ్డుకుని ధ్రువపత్రాలు చూపించాల్సిందిగా కోరారు.అన్ని పత్రాలు సమర్పించి, చెకింగ్ పూర్తయ్యే సరికి దాదాపు రెండు గంటల పాటు సమయం పట్టింది.

అనంతరం ఉదయం 11 గంటలకు తన్మన్ జిత్‌ను అధికారులు భారత్‌లోకి అనుమతించారు.

Advertisement

కాగా.వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళనకు మద్ధతు పలికిన భారత సంతతి బ్రిటీష్ ఎంపీ తన్మన్ జిత్ సింగ్ ధేసీ ఇండియా వచ్చినప్పుడల్లా విచిత్ర పరిస్ధితులు ఎదురవుతున్నాయి.రైతులు, రైతు సంఘాలు ఆయనను సత్కరిస్తుంటే.

పంజాబ్ బీజేపీ శాఖ మాత్రం తన్మన్‌ను ఖలిస్తాన్ మద్ధతుదారుడిగా ఆరోపిస్తోంది.గతేడాది ధేసీ పంజాబ్ వచ్చినప్పుడు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుభాష్ శర్మ( Subhash Sharma ) మాట్లాడుతూ.

కాశ్మీర్, పాకిస్తాన్, ఖలిస్తాన్‌కు సంబంధించి భారత్‌కు చెడ్డ పేరు తెచ్చే సమస్యలను ధేసి లేవనెత్తారంటూ ఎద్దేవా చేశారు.ఆయన ఇండియాపై ప్రతికూల వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందేనని.

తన్మన్‌కు ఖలిస్తానీ గ్రూపులతో సన్నిహిత సంబంధాలు వున్నాయని సుభాష్ శర్మ ఆరోపించారు.మీడియా నివేదికల ప్రకారం.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

నిషేధిత ఉగ్రవాద సంస్థ ‘‘ Sikhs for Justice’’ లండన్‌లో నిర్వహించిన రెఫరెండం 2020 ర్యాలీ సహా పలు సందర్భాలలో ధేసీ భారత్‌పై విమర్శలు చేశారు.

Advertisement

అంతేకాదు అప్పట్లో రైతుల సమస్యలపై భారత విదేశాంగ మంత్రితో చర్చించేందుకు గాను 36 మంది ఎంపీలు సంతకం చేసిన లేఖను యూకే విదేశాంగ మంత్రికి అందజేయడంలో తన్మన్‌జిత్ కీలకపాత్ర పోషించారు.రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించి, లాఠీఛార్జీ చేసిన వీడియోలు వైరల్ అయినప్పడు 100 మందికిపైగా బ్రిటీష్ ఎంపీల సంతకాలతో ఆయన నాటి యూకే ప్రధాని బోరిస్ జాన్సన్‌‌కు లేఖ రాశారు.

తాజా వార్తలు