బై బై జగన్.. ప్రజలు తిరగబడుతున్నారా !

వచ్చే ఎన్నికల్లో భారీ విజయం సాధించాలని ఏకంగా 175 స్థానాలను కైవసం చేసుకోవాలని టార్గెట్ పెట్టుకున్న ఏపీ సి‌ఎం జగన్( YS Jagan ) కు.

ఆ టార్గెట్ ఒక పగటికలే అని సంకేతాలు కనిపిస్తున్నాయి.

తాజాగా జరిగిన పట్టభధ్రుల ఎన్నికల్లో వైసీపీ కంటే టిడిపి( TDP ) మెరుగైన ఫలితాలు సాధించడంతో వైసీపీ ప్రభుత్వానికి గట్టి షాక్ తగిలిందనే చెప్పాలి.పట్టభద్రుల ఎన్నికలు జరిగిన మూడు చోట్లలో రెండిట్లో టీడీపీ విజయం సాధించిగా మరో చోట వైసీపీకి గట్టి పోటీ ఇచ్చింది.

దీంతో జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు ఎమ్మెల్సీ ఎన్నికలే నిదర్శనం అని కొందరు అభిప్రాయ పడుతున్నారు ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉండడంతో ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను సెమీ ఫైనల్ గా భావిస్తున్నాయి.

మొదటి నుంచి కూడా ఎమ్మేల్సి ఎన్నికల విషయంలో వైసీపీ ఫుల్ కాన్ఫిడెంట్ గానే కనిపిస్తూ వచ్చింది.ఈ ఎన్నికల్లో సత్తా చాటి వచ్చే సాధారణ ఎన్నికలకు రెట్టించిన ఉత్సాహంతో దూసుకుపోవలని భావించింది.తీర ఎమ్మేల్సి ఎన్నికలు వైసీపీ ఆశలను నీరుగార్చాయి.

Advertisement

సిపిఎస్ రద్దు, నో జాబ్ క్యాలెండర్ వంటి వాటి వల్ల ఉద్యోగుల్లోనూ పట్టభద్రుల్లోనూ జగన్ సర్కార్ పై తీవ్ర వ్యతిరేకత నెలకొంది.ఆ వ్యతిరేకత ఎమ్మేల్సి ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది.

దీంతో వచ్చే సాధారణ ఎన్నికల్లో కూడా వైసీపీకి షాక్ తప్పదా ? అనే సందేహాలు వ్యక్తమౌవుతున్నాయి.ఇక మరోవైపు జగన్ పై ఉన్న వ్యతిరేకతను టీడీపీకి అనుకూలంగా మార్చుకునే పనిలో పడ్డారు తెలుగుతమ్ముళ్ళు.

సోషల్ మీడియాలో బై బై జగన్ అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేసి రచ్చ చేస్తున్నారు.

ఇక పలు సర్వేలు కూడా ఈసారి వైసీపీకి( Ysrcp ) షాక్ తప్పదనే సంకేతాలు ఇస్తున్నాయి.వైసీపీపై ప్రజా వ్యతిరేకత ఏర్పడడానికి చాలానే కారణాలు ఉన్నాయనే చెప్పాలి.నిత్యవసర ధరల పెరుగుదల, ఇసుక విధానం, మద్యం విధానం, పెరిగిన బస్ ఛార్జీలు.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

ఇలా అన్నిటిపై కూడా జగన్ సర్కార్ పై ప్రజల్లో అసంతృప్తి నెలకొంది.అంతే కాకుండా ఈ నాలుగేళ్లలో సంక్షేమం పై చూపిన శ్రద్ద అభివృద్దిపై చూపలేదనే విమర్శ కూడా జగన్ సర్కార్ పై ప్రధానంగా వినిపిస్తోంది.

Advertisement

ఇదే తీరు వచ్చే ఎన్నికల వరకు కంటిన్యూ అయిందంటే ఏపీ ప్రజలు జగన్ ను గద్దె దించడం ఖాయమని ఎమ్మెల్సీ ఎన్నికలు చెప్పకనే చెబుతున్నాయి.మరి వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఎలాంటి ఫలితాలు వస్తాయో చూడాలి.

తాజా వార్తలు