శ్రీదేవిని షూటింగ్లో చెడామడా తిట్టేసిన నిర్మాత.. ఎందుకో తెలుసా?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీ అంటేనే గ్లామర్ ప్రపంచం.ఇక సినిమాల్లో హీరోయిన్లు ట్రెండ్కు తగినట్లుగా తమ గ్లామర్ను ఒలకపోస్తూ ఉంటారు.

ఇక ఇటీవల కాలంలో అయితే కాస్త గ్లామర్ డోస్ కూడా ఎక్కువే అయింది అని చెప్పాలి.మితిమీరిన రొమాంటిక్ సీన్లతో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాలని ఎంతో మంది దర్శక నిర్మాతలు భావిస్తున్నారు.

అంతేకాదు ఇక ఇటీవల కాలంలో లిప్ లాక్ సీన్లు అయితే సర్వసాధారణంగా మారిపోయాయి.ఇక ప్రతి ఒక్కరు కూడా తమ సినిమాల్లో ఇంటిమేట్ సీన్లు కూడా ఉండాలని అనుకుంటున్నారు.

హీరోయిన్ ఒప్పుకోవాలే కానీ ఇంకా మరింత రొమాంటిక్ గా చూపించడానికి కూడా రెడీ అవుతున్నారు.కానీ ఇటీవలి కాలంలో మాత్రం రొమాంటిక్ సన్నివేశాలు లేకుండా సినిమాలను తెరకెక్కించే దర్శక నిర్మాతలు అస్సలు లేరు అని చెప్పాలి.

Advertisement

కానీ ఒకప్పుడు మాత్రం ఒక నిర్మాత తాను నిర్మించే సినిమాలో ఎక్కడ బూతు అనేది లేకుండా సినిమాలు తీసేవారు అని ఒక టాక్.ఆయన పేరు కాట్రగడ్డ మురారి.

అప్పట్లో తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక గొప్ప నిర్మాతగా పేరు సంపాదించుకున్నారు.దర్శకుడు అవ్వాలని వచ్చిన ఆయన కొన్నాళ్ల పాటు అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పని చేశారు.

ఆ తర్వాత సినిమా రంగం లోని అన్ని విభాగాల్లో అనుభవం సాధించి ఇక నిర్మాత గా మారి పోయారు.

అప్పట్లో కేవలం కాట్రగడ్డ మురారి నిర్మాతగా ఉన్నారు అంటే చాలు అది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా అని నమ్మేవారు ప్రేక్షకులు.హీరో హీరోయిన్ ల తో సంబంధం లేకుండా ఇక ఈ నిర్మాత పేరు చూసి థియేటర్లకు వెళ్లేవారు.అయితే తన సినిమాలలో ఎక్కడ ఆడవాళ్లను చెడుగా చూపించడానికి అస్సలు అంగీకరించే వారు కాదట.

ఇరాన్ అధ్యక్షుడి మృతి కారణంగా.. రేపు సంతాపదినం ప్రకటించిన భారత్ ప్రభుత్వం..!!
రామ్ చరణ్ ఆ విషయం లో ఎందుకు సైలెంట్ గా ఉంటున్నాడు..?

అయితే ఒకానొక సమయంలో శ్రీదేవి కృష్ణంరాజు హీరో నటించిన సినిమాకు రాఘవేంద్ర రావు దర్శకత్వం వహిస్తున్నాడు.ఐతే ఒక సన్నివేశంలో తన పైట కొంగును తీసేసి కృష్ణంరాజును హత్తుకొని గట్టిగా ముద్దు పెట్టాలి శ్రీదేవి.

Advertisement

ఇక దర్శకుడు రాఘవేంద్రరావు చెప్పినట్లుగా ఈ సీన్ చేసింది.అయితే ఇక ఆ సీన్ జరుగుతున్న సమయంలోనే అక్కడ వచ్చి కూర్చున్న నిర్మాత కాట్రగడ్డ మురారి శ్రీదేవి దగ్గరికి వెళ్లి చెడామడా తిట్టేశాడు.

నా సినిమాలో ఇలా చేస్తావా అంటూ అడగడంతో డైరెక్టర్ చెప్పారు చేశాను అని చెప్పిందట శ్రీదేవి.రాఘవేంద్రరావు ఇది నా సినిమా ఇలాంటి సన్నివేశాలు ఎక్కడైనా చేసుకొ అని చెప్పడంతో ఇక ఆ సన్నివేశాన్ని మార్చి తెరకెక్కించారట రాఘవేంద్రరావు.

తాజా వార్తలు