మొదటి సినిమా హీరోయిన్ తో పవన్ కళ్యాణ్.. ఫోటో వైరల్!

సినీ నటుడుగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు నటుడు పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) .

ఈయన హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

అనంతరం రాజకీయాలలోకి అడుగు పెట్టారు.జనసేన పార్టీనీ( Janasena Party ) స్థాపించిన తర్వాత పది సంవత్సరాలు పాటు రాజకీయాలలో ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూ ఎంతో కష్టపడుతూ నేడు రాజకీయాలలో సంచలనంగా మారారు.

ప్రస్తుతం ఈయన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా అలాగే మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

ఇలా ఒక సినీ నటుడు ఉపముఖ్యమంత్రి కావడంతో చిత్ర పరిశ్రమ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.అంతేకాకుండా సినీ నటుడుగా చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి సమస్యలు ఆయనకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అయినా ఇండస్ట్రీ తరపున సినీ నిర్మాతలు అందరికీ కూడా ఉపముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి చిత్ర పరిశ్రమలో ఉన్న సమస్యలను వివరించి వారి సమస్యలను తీర్చాలని కోరారు.

Advertisement

ఈ క్రమంలోనే విజయవాడ క్యాంప్ ఆఫీస్ కు పలువురు సినీ నిర్మాతలు ప్రత్యేక విమానంలో వెళ్లారు.

ఇలా క్యాంప్ ఆఫీస్ లోనే నిర్మాతలందరూ పవన్ కళ్యాణ్ ని కలిసి వారి సమస్యలను తెలియచేయడంతో ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించారని తెలుస్తుంది.అయితే ఈ నిర్మాతలలో సుప్రియ యార్లగడ్డ(Supriya Yaarlagadda) కూడా ఉండటం విశేషం.ప్రస్తుతం ఈమె పవన్ కళ్యాణ్ తో దిగిన ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

ఈ ఫోటో వైరల్ అవుతుంది.అయితే ఈమె పవన్ కళ్యాణ్ నటించిన మొదటి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి( Akkada Ammayi Ikkada Abbayi ) చిత్రంలో కలిసిన నటించారు.

ప్రస్తుతం సుప్రియ నిర్మాతగా కొనసాగగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

కీర్తి సురేష్ పెళ్లి చీర కోసం అన్ని గంటలు కష్టపడ్డారా.. ఆ చీర ప్రత్యేకత ఏంటో తెలుసా?
Advertisement

తాజా వార్తలు