ఇండియన్ ఫస్ట్ మడ్ రేసింగ్ మూవీగా భారీ బడ్జెట్ తో తెలుగు, కన్నడ, హిందీ, తమిళ మరియు మలయాళం మొత్తం 5 భాషల్లో ప్యాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న భారతదేశపు మొట్టమొదటి మడ్ రేస్ చిత్రం `మడ్డీ`. తెలుగు, తమిళ, మళయాలం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఈ చిత్రం డిసెంబర్ 10న రాబోతోంది.
ఇంతకముందు ఎన్నడూ చూడని కాన్సెప్ట్ తో ఉత్కంఠ రేపేలా సాగే ఈ చిత్రంతో డాక్టర్ ప్రగభల్ దర్శకుడిగా పరిచయం అవుతుండగా యువన్, రిధాన్ కృష్ణ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.PK7 క్రియేషన్స్ బ్యానర్ పై ప్రేమ కృష్ణదాస్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.యువన్, రిధాన్ కృష్ణ, అనుషా సురేష్, అమిత్ శివదాస్ నాయర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో దిల్ రాజు విడుదల చేస్తున్నారు.
టాలీవుడ్‌లో నెంబర్ వన్ నిర్మాణ సంస్థ, డిస్ట్రిబ్యూషన్ సంస్థగా దూసుకుపోతోన్న శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ప్రై.లి. మడ్డీ సినిమా తెలుగు హక్కులను సొంతం చేసుకుంది.మడ్డీ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా విడుదల చేయబోతోంది.
ఈ సందర్భంగా ట్రైలర్‌ను నవంబర్ 30న సాయంత్రం 4:30 గంటలకు విడుదల చేయబోతోన్నట్టు ఓ పోస్టర్ ద్వారా ప్రకటించారు.
దర్శకుడు ప్రగభల్ కి ఆఫ్ రోడ్ రేసింగ్ పట్ల ఉన్న ఆసక్తి, అనుభవం నుండే ప్రధానంగా మడ్డీ రూపొందింది.అయిదు సంవత్సరాల రీసెర్చ్ అనంతరం పక్కా స్క్రిప్ట్ సిద్ధం చేసుకుని తీసిన ఈ సినిమా ప్రధానంగా రెండు వేర్వేరు జట్ల మధ్య శత్రుత్వం, ప్రతీకారం గురించి ఉన్నప్పటికీ ఫ్యామిలీ డ్రామా, హాస్యం, సాహసం ఇలా ప్రతి ఎమోషన్ ఈ మూవీలో ఉంటుంది.ఈ సినిమా కోసం ఆఫ్-రోడ్ రేసింగ్‌లో ప్రధాన నటులకు రెండేళ్లు శిక్షణ ఇవ్వడం జరిగింది.
ఆర్టిస్టులు ఏ డూప్ లేదా జూనియర్ స్టంట్ మేన్ లేకుండా సాహసోపేత సీన్స్, స్టంట్స్ చేయడం విశేషం.కేజీయఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతాన్ని అందిస్తుండగా.
రాక్షసన్ ఫేమ్ శాన్ లోకేష్ ఎడిటర్‌గా కేజీ రతీష్ సినిమాటోగ్రఫర్‌గా వ్యవహరిస్తున్నారు.
విజయ్ సేతుపతి, శ్రీమురళి కలిసి మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు.హిందీలో అర్జున్ కపూర్, తమిళంలో జయం రవి, కన్నడలో శివ రాజ్ కుమార్, తెలుగులో అనిల్ రావిపూడి ఈ టీజర్‌ను విడుదల చేశారు.ఇక ఫాహద్ ఫాజిల్, ఉన్ని ముకుందన్, అపర్ణా బాలమురళీ, అసిఫ్ ఆలీ, సిజు విల్సన్, అమిత్ చక్కలక్కల్ మళయాలంలో టీజర్‌ను విడుదల చేశారు.
ఆ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది.అద్బుతమైన లొకేషన్లలో అడ్వంచరస్ చిత్రంగా రూపొందించిన ఈ చిత్రం విజువల్ ట్రీట్‌గా ఉండబోతోంది.
ఈ చిత్రంలో ఫ్యామిలీ లైఫ్, యాక్షన్, కామెడీ ఇలా అన్ని రకాల ఎమోషన్స్ ఉండబోతోన్నాయి.ఈ స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో రాబోతోన్న ఈ చిత్రంలో మడ్ రేస్‌తో ప్రేక్షకులను కట్టిపడేయడం దర్శకుడికి సవాల్‌తో కూడుకున్న పని.