సాధారణంగా సెలబ్రిటీల కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తమ అభిమాన సెలబ్రిటీలను ఒక్కసారి అయినా కలవాలని, వారితో కలిసి సెల్ఫీ దిగాలని తెగ ఆరాట పడుతూ ఉంటారు.
ఇండస్ట్రీలో ప్రతి ఒక సెలబ్రిటీ ఇంటి ముందు కూడా అభిమానులు ఆ సెలబ్రిటీల కోసం పడిగాపులు కాస్తూ ఉంటారన్న విషయం తెలిసిందే.అయితే అలా ప్రియాంక కోసం ఒక అభిమాని ఇంటి ముందు గంటల తరబడి ఎదురుచూసేవాడు అంటూ ప్రియాంక చోప్రా తన జీవితంలో జరిగిన ఒక వింత సంఘటన గురించి చెప్పుకొచ్చింది.
ద మ్యాట్రిక్స్’ తాజా సీక్వెల్‌లో ప్రియాంక చోప్రా నటించిన విషయం తెలిసిందే.ఇక ఈ ప్రమోషన్స్‌లో భాగంగానే ప్రియాంక ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది.
అందులో తన విచిత్ర అనుభవం గురించి చెబుతూ ఆరో తరగతి అభిమాని గురించి కూడా చెప్పుకొచ్చింది.అతను ప్రతీ వీకెండ్ సమయంలో స్కూలు లేనప్పుడు ప్రియాంక ఇంటి ముందుకు వచ్చేవాడట.
గంటల తరబడి ఎదురు చూసేవాడట.ఇలా రెండు, మూడు వారాలు గడిచాక ఆ పిల్లాడి సంగతి సెక్యూరిటీ వాళ్లు పీసీకి చెప్పారట.
ఆమె ఓ వారాంతంలో అబ్బాయిని ఇంట్లోకి పిలిపించిందట.

ఎందుకు ప్రతీ వారం గంటల తరబడి వెయిట్ చేస్తున్నావంటూ ప్రశ్నించగా.తనకు ప్రియాంక అంటే ఇష్టమని చెబుతూ ఆమెతో స్నేహం చేయాలని ఉందన్నాడట.అలా ఆరో తరగతి చదివే పిల్లాడికి తనపై అంత అభిమానం ఉండటం మొదట్లో ప్రియాంకకి కూడా కాస్త ఆశ్చర్యంగా అనిపించిందట.
కానీ, ఆ తరువాత వారిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారట.కొన్నాళ్లు టచ్‌లో కూడా ఉన్నామని తెలిపింది.అయితే, ఇప్పుడు ఆ మాజీ ఆరో తరగతి విద్యార్థి ఏం చేస్తున్నాడో, టచ్‌లో ఉన్నాడో లేదో మాత్రం చెప్పలేదు.