ప్రియాంక చోప్రా సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ కు ఎంత సంపాదిస్తుందంటే ...!

భారతీయ అందం మాజీ విశ్వసుందరి ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ప్రపంచ వ్యాప్తంగా ఆమె ఎంత పాపులర్ నటో అందరికీ తెలిసిన విషయమే.

బాలీవుడ్ లోని మాత్రమే కాకుండా హాలీవుడ్ లో కూడా తనదైన ముద్ర వేసుకున్న నటి ప్రియాంక చోప్రా.అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్ ను సంవత్సరంపాటు ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈమె లాస్ ఏంజిల్స్ లో కాపురం పెట్టేసింది.

ఇక ఈ పాప్ సింగర్ ను పెళ్లి చేసుకున్న తర్వాత ఈ అమ్మడికి మామూలు పాపులారిటీ పెరగలేదు.ప్రపంచవ్యాప్తంగా ప్రియాంక చోప్రా పేరు మార్మోగిపోయింది.

అయితే ప్రస్తుతం ప్రియాంక చోప్రా కు తన ఇన్స్టాగ్రామ్ లో ఏకంగా ఐదున్నర కోట్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.అయితే స్టార్ డం ఉన్న నటీనటులు చాలామంది ఒక్కొక్కసారి పెయిడ్ పోస్టులను వారి ఖాతాలో పోస్ట్ చేస్తూ ఉంటారు.

Advertisement

ఇందుకుగాను వారు తీసుకునే పారితోషకం గురించి వింటే నిజంగా గుండె ఆగినంత పనవుతుంది.అయితే ఇదే వరుసలో ప్రియంక చోప్రా ఒక్క ప్రమోషన్ పోస్టుకు ఏకంగా రెండు కోట్ల రూపాయల వరకు తీసుకుంటోందని తెలుస్తోంది.

ఈ విధంగా భారత నటీనటుల్లో ఈవిడ మొదటి స్థానం.ఈ విధంగా ప్రపంచంలో ఇన్స్టాగ్రామ్ ద్వారా అత్యధిక సొమ్మును సంపాదించే వ్యక్తులలో ఈవిడ 28వ స్థానాన్ని పొందింది.

అలాగే తాజాగా ప్రియాంక చోప్రా సినీ కెరీర్ సంగతి చూస్తే.ఆవిడ అమెజాన్ ప్రైమ్ తో భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

రెండు సంవత్సరాల పాటు కొనసాగే ఈ కాంట్రాక్ట్ పరంగా ఆవిడ వందలాది కోట్లల లో ఒప్పందాన్ని కుదుర్చుకుంది.ఇందుకుగాను హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఆమె నటించబోతోంది.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
భర్తతో దిగిన ఫోటోలను డిలీట్ చేయాలని కోరిన కత్రినా కైఫ్.. అసలేం జరిగిందంటే?

ఈ విషయంపై ఆమె స్పందిస్తూ.తాము నిర్మించే షోలతో మరింత భారతీయతను పెంపొందిస్తాయని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు