భారీ ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన బ్యూటీ.. ఎవరో తెలుసా?

టాలీవుడ్ దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు తన తాజా చిత్రాన్ని తాజాగా ప్రకటించారు.ఈ సినిమాకు ‘పెళ్లిసందడి’ అనే టైటిల్‌ను రాఘవేంద్ర రావు ప్రకటించగా, ఈ సినిమాపై అప్పుడే మంచి అంచనాలు క్రియేట్ అవుతున్నాయి.24 ఏళ్ల క్రితం ఇదే టైటిల్‌తో వచ్చిన సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో పూర్తిగా సక్సెస్ కావడంతో ‘పెళ్లిసందడి’ బ్లాక్‌బస్టర్ మూవీగా నిలిచింది.

 Priya Varrier Rejects Raghavendra Rao Movie, Priya Varrier, Raghavendra Rao, Pel-TeluguStop.com

ఇక ఈ సినిమా టైటిల్‌తో ఇప్పుడు మరోసారి పెళ్లిసందడి చిత్రాన్ని తెరకెక్కించేందుకు దర్శకేంద్రుడు రెడీ అయ్యాడు.

కాగా ఈ సినిమాలో ఎవరెవరు నటిస్తారా అనే అంశం ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.గతంలో ‘పెళ్లిసందడి’ చిత్రంలో శ్రీకాంత్, రవళి, దీప్తి భట్నాగర్ కలిసి నటించడంతో ఈ సినిమా ఫ్యామిలి చిత్రాల్లో మేటి చిత్రంగా నిలిచింది.

కాగా ఈ సినిమా అందుకున్న సక్సెస్ అప్పట్లో ఓ సెన్సేషన్ అని చెప్పాలి.ఇప్పుడు మరోసారి పెళ్లిసందడి చేసేందుకు రాఘవేంద్ర రావు రెడీ అవుతున్నారు.ఈ క్రమంలో ఈ సినిమాలో నటించే ఛాన్స్‌ను ఓ బ్యూటీ రిజెక్ట్ చేసినట్లు చిత్ర వర్గాలు అంటున్నాయి.

వింక్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ ఈ సినిమాలో నటించే అవకాశాన్ని రిజెక్ట్ చేసిందనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఈ సినిమాలో హీరోగా శ్రీకాంత్ కొడుకు రోషన్ నటిస్తుండటమే దీనికి అసలు కారణమని తెలుస్తోంది.ఇంకా హీరోగా ఎలాంటి క్రేజ్ లేని రోషన్‌తో నటించేందుకు ప్రియా వారియర్ సంకోచించిందని, అందుకే ఈ బిగ్ ఆఫర్‌ను ఆమె రిజెక్ట్ చేసిందనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

మరి రోషన్ సరసన హీరోయిన్‌గా ఎవరు నటిస్తారనే అంశం ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.ఇక ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube