భారీ ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన బ్యూటీ.. ఎవరో తెలుసా?

టాలీవుడ్ దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు తన తాజా చిత్రాన్ని తాజాగా ప్రకటించారు.

ఈ సినిమాకు ‘పెళ్లిసందడి’ అనే టైటిల్‌ను రాఘవేంద్ర రావు ప్రకటించగా, ఈ సినిమాపై అప్పుడే మంచి అంచనాలు క్రియేట్ అవుతున్నాయి.

24 ఏళ్ల క్రితం ఇదే టైటిల్‌తో వచ్చిన సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.

పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో పూర్తిగా సక్సెస్ కావడంతో ‘పెళ్లిసందడి’ బ్లాక్‌బస్టర్ మూవీగా నిలిచింది.

ఇక ఈ సినిమా టైటిల్‌తో ఇప్పుడు మరోసారి పెళ్లిసందడి చిత్రాన్ని తెరకెక్కించేందుకు దర్శకేంద్రుడు రెడీ అయ్యాడు.

కాగా ఈ సినిమాలో ఎవరెవరు నటిస్తారా అనే అంశం ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

గతంలో ‘పెళ్లిసందడి’ చిత్రంలో శ్రీకాంత్, రవళి, దీప్తి భట్నాగర్ కలిసి నటించడంతో ఈ సినిమా ఫ్యామిలి చిత్రాల్లో మేటి చిత్రంగా నిలిచింది.

కాగా ఈ సినిమా అందుకున్న సక్సెస్ అప్పట్లో ఓ సెన్సేషన్ అని చెప్పాలి.

ఇప్పుడు మరోసారి పెళ్లిసందడి చేసేందుకు రాఘవేంద్ర రావు రెడీ అవుతున్నారు.ఈ క్రమంలో ఈ సినిమాలో నటించే ఛాన్స్‌ను ఓ బ్యూటీ రిజెక్ట్ చేసినట్లు చిత్ర వర్గాలు అంటున్నాయి.

వింక్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ ఈ సినిమాలో నటించే అవకాశాన్ని రిజెక్ట్ చేసిందనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఈ సినిమాలో హీరోగా శ్రీకాంత్ కొడుకు రోషన్ నటిస్తుండటమే దీనికి అసలు కారణమని తెలుస్తోంది.

ఇంకా హీరోగా ఎలాంటి క్రేజ్ లేని రోషన్‌తో నటించేందుకు ప్రియా వారియర్ సంకోచించిందని, అందుకే ఈ బిగ్ ఆఫర్‌ను ఆమె రిజెక్ట్ చేసిందనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

మరి రోషన్ సరసన హీరోయిన్‌గా ఎవరు నటిస్తారనే అంశం ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

ఇక ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.

రంగంలోకి నందమూరి బ్రదర్ .. నేటి  నుంచే ఎన్నికల ప్రచారం