కేసీఆర్ పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

నిజామాబాద్ జిల్లాలో ప్రధాని మోదీ పర్యటన కొనసాగుతోంది.

ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన ఇందూరు జనగర్జన సభలో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల తరువాత కేసీఆర్ ఢిల్లీ వచ్చి తనను కలిశారని మోదీ తెలిపారు.ఈ క్రమంలోనే ఊహకందని స్థాయిలో కేసీఆర్ తనను పొగడ్తలతో ముంచెత్తారని చెప్పారు.

కేసీఆర్ తన సహజశైలికి విరుద్ధంగా తనను సన్మానించారన్నారు.తాను కూడా ఎన్డీఏలో చేరతానని కేసీఆర్ కోరారని పేర్కొన్నారు.

అయితే దీనిపై ప్రతిపక్షంలో కూర్చోవడానికి సిద్ధం కానీ ఎన్డీఏలోకి మాత్రం కేసీఆర్ ను రానిచ్చేది లేదన్నట్లు తెలిపారు.ఈ నేపథ్యంలోనే మరోసారి కేసీఆర్ ఢిల్లీ వచ్చారన్న మోదీ తాను చేయాల్సిందంతా చేశాను.

Advertisement

కేటీఆర్ ని అధికారపీఠంపై కూర్చోపెడతా అని చెప్పారని వెల్లడించారు.అయితే తెలంగాణలో అధికారం ఎవరు చెలాయించాలో ప్రజలు నిర్ణయిస్తారన్న మోదీ వారసుడికి అధికారం కట్టబెట్టడానికి ఇదేమీ రాచరికం కాదని చెప్పానని పేర్కొన్నారు.

ఆ రోజు నుంచి కేసీఆర్ తనకు ఎదురుపడటం లేదని, తన కళ్లల్లో కళ్లు పెట్టి చూడటానికి కేసీఆర్ భయపడుతున్నారని తెలిపారు.తాను ఎన్ని అభివృద్ధి పనులు ప్రారంభించినా తనతో వేదిక పంచుకోవడానికి కేసీఆర్ కు ధైర్యం సరిపోవడం లేదని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు