హైదరాబాద్ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ తెలంగాణలోని హైదరాబాద్ కు రానున్నారు.

ఇందులో భాగంగా గచ్చిబౌలిలో జరగనున్న అల్లూరి సీతారామ రాజు 125వ జయంతి ముగింపు ఉత్సవాల్లో ఆమె పాల్గొననున్నారు.

ప్రత్యేక విమానంలో హైదరాబాద్ లోని హకీంపేట్ విమానాశ్రయానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేరుకోనున్నారు.ఎయిర్ పోర్టులో ద్రౌపది ముర్ముకు రాష్ట్ర సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ లు ఘనంగా స్వాగతం పలకనున్నారు.

తరువాత హకీంపేట్ ఎయిర్ పోర్టు నుంచి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లనున్నారు ద్రౌపది ముర్ము.మధ్యాహ్నం 3.40 గంటలకు గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియానికి చేరుకుని అల్లూరి సీతారామరాజు జయంతి ముగింపు ఉత్సవాల్లో పాల్గొననున్నారు.కార్యక్రమం అనంతరం ఆమె ఢిల్లీకి తిరుగు పయనం కానున్నారు.

ప్రభాస్ హీరోయిన్ షాకింగ్ డిమాండ్స్ నెట్టింట వైరల్.. ఆమె డిమాండ్లు ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు