షర్మిలమ్మ ఏపీ వరకే చాలమ్మా ! క్లారిటీ ఇచ్చేసిన కాంగ్రెస్ ?

తెలంగాణ ముఖ్యమంత్రి కావాలనే పట్టుదలతో వైఎస్సార్ తెలంగాణ పార్టీ స్థాపించిన వైఎస్ షర్మిలకు పరిస్థితులు అనుకూలంగా మాత్రం మారడం లేదు.ఇప్పటి వరకు ఏదో రకంగా పార్టీని నడుపుకొచ్చినా, ముందు ముందు నడిపించలేని పరిస్థితి ఏర్పడడం , రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయడం ఇప్పట్లో సాధ్యం కాదనే అభిప్రాయంతో ఉన్న షర్మిల కాంగ్రెస్( Congress party ) తో పొత్తు పెట్టుకుని కొన్ని సీట్లలోనైనా పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలనే ఆలోచనతో ఉంటూ వచ్చారు.

 Rahul Gandhi Comments On Ys Sharmila, , Telangana Congress, Ysrtp, Ys Sharmila-TeluguStop.com

అయితే కాంగ్రెస్ మాత్రం షర్మిల తో పొత్తుకు అంగీకరించడం లేదు.పార్టీని కాంగ్రెస్ లో వీలైనంత చేయాలని షరతులు పెట్టింది దీంతో షర్మిల కూడా పార్టీని విలీనం చేయాలనే నిర్ణయానికి వచ్చారు.

అయితే తెలంగాణ రాజకీయాల్లోనే క్రియాశీలకంగా వ్యవహరించేందుకు షర్మిల ప్రయత్నిస్తుండగా,  కాంగ్రెస్ కీలక నేతలు మాత్రం తెలంగాణ రాజకీయాలలో మీ అవసరం ఉండదని, ఏపీలో కాంగ్రెస్ బాధ్యతలు చూస్తే సరిపోతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి.

Telugu Ap, Brs, Rahul Gandhi, Telangana, Ys Sharmila, Ysrtp-Politics

 ఏపీ కాంగ్రెస్ కు అధ్యక్షురాలుగా నియమించేందుకు సిద్ధమనే సంకేతాలు పంపిస్తున్నా, షర్మిల మాత్రం ఈ విషయంలో ఏ క్లారిటీకి రాలేకపోతున్నారు.  మరికొద్ది నెలల్లో తెలంగాణలో ఎన్నికలు రాబోతున్నాయి.దీంతో షర్మిల ఏ విధంగా ముందుకు వెళ్లాలనే విషయంలో క్లారిటీకి రాలేకపోతున్నారు.

ఒకవేళ పార్టీని సొంతంగా ముందుకు తీసుకువెళ్దాం అన్నా, ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉండడం,  రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయడం ఇప్పట్లో సాధ్యం కాదనే విషయం తేలిపోవడం వంటి కారణాలతో షర్మిల ఆలోచనలో పడ్డారు.అయితే కాంగ్రెస్ కీలక నాయకులంతా షర్మిలను( YS Sharmila )ఏపీకి పంపించి,  అక్కడ పార్టీకి పునర్ వైభవం తీసుకురావాలనే ఆలోచనతో ఉండగా ,షర్మిల మాత్రం ఏపీ రాజకీయాల్లోకి వెళ్లేందుకు ఏమాత్రం ఇష్టపడడం లేదు.

Telugu Ap, Brs, Rahul Gandhi, Telangana, Ys Sharmila, Ysrtp-Politics

వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ప్రాణ స్నేహితుడిగా ముద్రపడిన మాజీ ప్రభుత్వ సలహాదారు కెవిపి రామచంద్రరావు కూడా షర్మిలను ఏపీ రాజకీయాల్లో కీలకంగా కావాలని ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం.ఇక కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ( Rahul gandhi ) ఖమ్మం కాంగ్రెస్ బహిరంగ సభకు హాజరైన సందర్భంగా విజయవాడకు వచ్చిన రాహుల్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ,  షర్మిల ఏపీ కాంగ్రెస్ కు పునర్ వైభవం తీసుకొస్తారనే విధంగా వ్యాఖ్యానించారు.దీనికి తోడు తెలంగాణ కాంగ్రెస్ లో షర్మిల ప్రభావం అంతంత మాత్రమే అన్నట్టు గా ఉంటుందని , అదే ఏపీ కాంగ్రెస్ లో ఆమె కీలకంగా మారితే,  పార్టీకి కాస్త ఊపు వస్తుందని సర్వే నివేదికల్లో తేలడంతో  షర్మిలను ఏపీ రాజకీయాల వైపే పంపేందుకు కాంగ్రెస్ అధిష్టానం ఆసక్తి చూపుతోంది.కానీ ఈ విషయంలో షర్మిల మాత్రం ఏ నిర్ణయం తీసుకోలేక సైలెంట్ అయిపోయారు.

త్వరలోనే ఆమె నిర్ణయాన్ని ప్రకటిస్తారని ఆమె సన్నిహితుల ద్వారా తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube