ప్ర‌వీణ్‌కుమార్‌కు యూత్‌లో పెరుగుతున్న ఆద‌ర‌ణ‌.. రాజ‌కీయాల్లో సంచ‌ల‌నం సృష్టిస్తారా..?

మాజీ ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్.

ప్రవీణ్ కుమార్‌ వీఆర్ఎస్ తీసుకుని రాజకీయాల్లోకి రాబోతున్నారన్న సంగతి అందరికీ తెలిసిందే.

బహుజన సమాజ్‌వాదీ పార్టీలో ప్రవీణ్ కుమార్ చేరబోతున్నట్లు బీఎస్పీ అధినేత్రి మాయావతి ఇటీవల ప్రకటించింది.

ఈ క్రమంలోనే ప్రవీణ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించబోతున్నారా? అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతున్నది.అయితే, మార్పును తీసుకొచ్చేందుకు ప్రవీణ్ కుమార్ తనవంతు ప్రయత్నం చేస్తారని స్వేరోస్, ప్రవీణ్‌ను అభిమానించే వారు చెప్తున్నారు.

బహుజనవాదం అనే అంశం నేటి రాజకీయాల్లో మాత్రమే కాదు గతంలోనూ చర్చనీయాంశంగా ఉండేది.కానీ, కాలక్రమేణా రాజకీయాల్లో వచ్చిన మార్పులు చర్చను వేరే తోవలో పోయేలా చేశాయి.

Advertisement

సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలల కార్యదర్శిగా ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ సేవల పట్ల సొసైటీలో మంచి అభిప్రాయమే ఉంది.ముఖ్యంగా యువతలో సామాజిక స్పృహను రగిలించారు ప్రవీణ్.

జ్ఞాన మార్గంలో పయనించడం ద్వారానే అట్టడుగున ఉన్న వర్గాల అభివృద్ధి జరుగుతుందని ప్రవీణ్ చెప్తున్నారు.విద్య, వైద్యం పట్ల శ్రద్ధ వహించాలనేది ప్రవీణ్ లక్ష్యం.

ఇక ఇప్పటికే తాను సాధించింది అతి తక్కువ మాత్రమేనని, రాజకీయాల్లోకి రావడం ద్వారా సాధించాల్సింది ఇంకా చాలా ఉందని ప్రవీణ్ పేర్కొంటున్నారు.

ఐపీఎస్ ఆఫీసర్‌గా సొసైటీని స్టడీ చేసిన ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ రాజకీయాల్లోకి రావడం మంచిదేనని రాజకీయ వర్గాల్లో ఉన్న మేధావులు, ఇతర పార్టీల నేతలు ఆహ్వానిస్తున్నారు.ఇంకా చెప్పాలంటే యూత్‌లో ఆయ‌న రావాల‌నే కోరిక చాలా బ‌లంగా మారుతోంది.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

ఆయన రావడం ద్వారా సొసైటీలో మార్పులను గమనించొచ్చని ఆకాంక్షిస్తున్నారు.అయితే, నిర్దిష్టంగా రాజకీయ కార్యచరణ రూపొందించుకుని యూత్‌ను అట్రాక్ట్ చేస్తూనే ప్రజల్లో మంచి ఆదరణ పొందితే రాజకీయంగా ప్రవీణ్ సక్సెస్ అయ్యే చాన్సెస్ ఉంటాయని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

Advertisement

కేవలం తెలంగాణలోనూ కాకుండా దేశవ్యాప్తంగా ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ రాజకీయ కార్యచరణ ఎలా ఉండబోతుందని ఎదురు చూస్తున్నారు.

తాజా వార్తలు