మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కరోనా...?

ఇప్పటికే దేశంలో ఉధృతంగా విస్తరిస్తున్న కరోనా.సామాన్యులు, సెలబ్రిటీల అని తేడా లేకుండా అందరినీ తన కోరల్లో బంధిస్తుంది.

ఇప్పటికే ఈ కరోనా కోరలలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కర్ణాటక సీఎం యడ్యూరప్ప, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్,కోన రఘుపతి,మంత్రి బాలినేని, మొహమ్మద్ ఆలీ,ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం, సింగర్ స్మిత వంటి ప్రముఖులు ఉన్నారు.అయితే తాజాగా ఈ లిస్ట్ లోకి మరొక ప్రముఖ వ్యక్తి చేరారు.

ఆయన ఎవరో ఇప్పుడు చూద్దాం.సుదీర్ఘకాలం పాటు దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి తాజాగా నిర్వహించిన పరీక్షలలో కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది.

ఈ విషయాన్ని స్వయంగా ప్రణబ్ ముఖర్జీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.అంతేకాకుండా ఆయన కలిసిన వారంతా వెంటనే కరోనా టెస్టులు చేయించుకోవాలని ట్విట్టర్ వేదికగా కోరారు.

Advertisement

రోజురోజుకీ కరోనా ఉధృతి దేశ వ్యాప్తంగా పెరుగుతుంది.దీన్ని కట్టడి చేయడానికి ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్న ఫలితాన్ని ఇవ్వట్లేదు.

దాని ఫలితంగా కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి.రికవరీ రేటు ఎక్కువగా ఉండడం వల్లనే ప్రజలు ఈ విషయాన్ని చాలా లైట్ తీసుకుంటున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు