మారిపోయిన ప్రభాస్.. అలాంటి సినిమాలే చేస్తాడంట..?

సినిమాల్లో బ్యాక్ గ్రౌండ్ బాగానే ఉన్నా ఎంతో కష్టపడి అనతి కాలంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరోల్లో ప్రభాస్ ఒకరు.

కెరీర్ మొదట్లో ప్రభాస్ ఒక హిట్టూ రెండు ఫ్లాపులతో ఇబ్బందులు పడ్డా డార్లింగ్ సినిమా నుంచి వరుస విజయాలతో దూసుకెళుతున్నాడు.

మధ్యలో ఒకటీ రెండు ఫ్లాపులు వచ్చినా అవి ప్రభాస్ కెరీర్ పై పెద్దగా ప్రభావం చూపలేదు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ప్రభాస్ సినిమాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.

రాజమౌళి ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఛత్రపతి సినిమా ఇద్దరికీ మంచి పేరు తీసుకురాగా బాహుబలి, బాహుబలి 2 సినిమాలు అంచనాలను మించి సక్సెస్ ఆయ్యాయి.ప్రభాస్ కు ఈ సినిమాలు భారత్ తో పాటు ఇతర దేశాల్లో సైతం గుర్తింపు తెచ్చిపెట్టాయి.

దీంతో బాహుబలి 2 తరువాత ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలన్నీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి.అయితే బ్లాక్ బస్టర్ టాక్ వస్తే మాత్రమే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభాస్ నటించే సినిమాలు ఆ బడ్జెట్ కు తగిన కలెక్షన్లు వసూలు చేయగలవు.

Advertisement

బాహుబలి 2 సినిమా తరువాత ప్రభాస్ సుజీత్ కాంబినేషన్ లో తెరకెక్కిన సాహో సినిమాకు ఫ్లాప్ టాక్ రావడంతో దాదాపు 40 కోట్ల రూపాయల వరకు నష్టాలు వచ్చాయి.ప్రభాస్ భవిష్యత్తు ప్రాజెక్టులైన రాధేశ్యామ్, ఆదిపురుష్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలోని సినిమా కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి.

అయితే కరోనా, లాక్ డౌన్ వల్ల థియేటర్ల వైపు ప్రేక్షకులు ఆసక్తి చూపడానికి ఇష్టపడని నేపథ్యంలో ప్రభాస్ కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.ఇప్పటికే తన నిర్మాతలకు బడ్జెట్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని.

బడ్జెట్ పెరుగుతూ పోతే ఇబ్బందులు పడక తప్పదని చెప్పారని సమాచారం.ప్రభాస్ చెప్పిన మాటలతో నిర్మాతలు మొదట ఆశ్చర్యపోయినా లిమిటెడ్ బడ్జెట్ లోనే సినిమాలు చేస్తానని ప్రభాస్ చెప్పడం వల్ల సినిమా హిట్టైతే లాభాలు పెరుగుతాయని నిర్మాతలు భావిస్తున్నట్టు తెలుస్తోంది.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు