అభిమానులకు పూనకాలు తెప్పిస్తున్న 'సలార్‌' లీక్ వీడియో

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా సలార్‌.

ఈ సినిమా కు కేజీఎఫ్‌ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెల్సిందే.

రికార్డు బ్రేకింగ్ వసూళ్లను ఈ సినిమా దక్కించుకుంటుందనే నమ్మకంను అంతా వ్యక్తం చేస్తున్నారు.సినిమా కోసం ఇప్పటికే ప్రశాంత్ నీల్‌ రెండు షెడ్యూల్ లను ముగించాడు.

వచ్చే షెడ్యూల్‌ తో సినిమా ముగుస్తుందనే వార్తలు వస్తున్నాయి.సాహో రేంజ్ లో సలార్‌ లో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని.

తుపాకులతో ప్రభాస్‌ చేసే విన్యాసాలు సినిమా కు ప్రధాన ఆకర్షణగా ఉంటాయి అంటున్నారు.మొత్తంగా రికార్డు స్థాయిలో సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేయడంతో పాటు అన్ని విధాలుగా సినిమాను ప్రమోట్ చేస్తున్నారు.

Advertisement

ఈ సమయంలోనే సినిమా లోని ఒక చిన్న 10 సెకన్ల వీడియో బిట్‌ బయటకు వచ్చింది.అది కాస్త వైరల్‌ అయ్యి సినిమా రేంజ్ ను అమాంతం పెంచేసింది.

లీక్ అయిన వీడియోలో ప్రభాస్‌ యాక్షన్‌ మూడ్ లో ఉన్నాడు.రెండు తుపాకులను చేత పట్టుకుని రౌడీ లను చిత్తు చిత్తుగా కొడుతూ దుమ్ము రేపుతున్నాడు.

అద్బుతమైన యాక్షన్‌ సన్నివేశాలను ప్రశాంత్‌ నీల్ రూపొందిస్తాడు అనడంలో సందేహం లేదు.అతడి నుండి వచ్చే ప్రతి సన్నివేశం కూడా సూపర్‌ అన్నట్లుగా ఉంటుంది.

అభిమానులు మరియు ఇతర వర్గాల ప్రేక్షకులు అంతా కూడా ఆ లీక్ వీడియోకు ఫిదా అవుతున్నారు.ఇలాంటి ఫుల్‌ లెంగ్త్‌ మాస్ సినిమా లు చూసి రెండేళ్లు అయ్యింది.కరోనా వల్ల ఎన్నో సినిమాలు ఆగిపోతున్నాయి.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

సలార్ ఎప్పుడెప్పుడు వస్తుందో అంటూ ఎదురు చూస్తున్నామని అభిమానులు అంటున్నారు.సినిమా చిత్రీకరణ మొదలు పెట్టింది మొదలు అంచనాలు పెంచుకుంటూ పోతూనే ఉన్నారు.

Advertisement

సినిమా షూటింగ్ పూర్తి చేసి సమ్మర్ లో విడుదల చేయడం కోసం యూనిట్‌ సభ్యులు వచ్చే నెల నుండి సినిమా ను పునః ప్రారంభించబోతున్నారు.

తాజా వార్తలు