ఆ మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు.. ప్రభాస్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా సినిమాల్లో  నటిస్తూ పాన్ ఇండియా హీరోగా క్రేజ్ ను సొంతం చేసుకున్న నటులలో ప్రభాస్ ఒకరు.

దేశంలోనే హైయెస్ట్ కలెక్షన్లను సాధించిన సినిమాగా ప్రభాస్ నటించిన బాహుబలి2 సినిమా నిలిచింది.

సాహో ఆ స్థాయిలో కలెక్షన్లను సాధించలేకపోయినా ఫ్లాప్ టాక్ తో కూడా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది.ప్రభాస్ కు ఉన్న క్రేజ్ వల్ల చాలామంది అతనిని బిగ్గెస్ట్ స్టార్ ఆఫ్ ఇండియా అని పిలుస్తున్నారు.

సినిమా సినిమాకు ప్రభాస్ కు పాపులారిటీ పెరుగుతుండటంతో 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో ప్రభాస్ తో సినిమాలను నిర్మించడానికి కూడా నిర్మాతలు వెనుకాడటం లేదు.తాజాగా ఒక ఇంటర్వ్యూలో బిగ్గెస్ట్ స్టార్ ఆఫ్ ఇండియా అని పిలవడం గురించి స్పందన ఏమిటని ప్రభాస్ కు ప్రశ్న ఎదురైంది.

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ లలో ఒకరైన సెంథిల్ కుమార్ ప్రభాస్ ను ఈ విధంగా పిలుస్తున్నారు.బాలీవుడ్ స్టార్స్ ను ప్రభాస్ మించిపోయాడని కామెంట్లు వినిపిస్తున్నాయి.

Prabhas Response On Biggest Star Of India , Prabhas , Bahu Bali , Tollywood ,
Advertisement
Prabhas Response On Biggest Star Of India , Prabhas , Bahu Bali , Tollywood ,

బాహుబలి సినిమాకు ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేసిన సాబు సిరిల్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.ఒక సందర్బంలో సాబు సిరిల్ ఇండియాలోనే అతిపెద్ద స్టార్ గా ప్రభాస్ కు పేరుందని తెలిపారు.ఖాన్ ల కంటే ప్రభాస్ గొప్పవాడని 1,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం ఖాన్ ల సినిమాలలో ఏ సినిమాకు రాలేదని సాబు సిరిల్ తెలిపారు.

బాహుబలి సినిమాకు పని చేసినందుకు ఎంతో గర్వంగా ఉందని బాహుబలి మాత్రమే ఆ స్థాయిలో కలెక్షన్లను సాధించిందని సాబు సిరిల్ అన్నారు.

Prabhas Response On Biggest Star Of India , Prabhas , Bahu Bali , Tollywood ,

ప్రభాస్ ఈ కామెంట్ల గురించి స్పందిస్తూ సెంథిల్ కు ఉత్సాహం కొంచెం ఎక్కువైందని తెలిపారు.ఆ కారణం వల్లే అతను బిగ్గెస్ట్ స్టార్ ఆఫ్ ఇండియాగా పిలిచారని ప్రభాస్ పేర్కొన్నారు.బాహుబలి సాధించిన స్థాయిలో ఇప్పటివరకు ఏ సినిమా కలెక్షన్లను సాధించలేదని అత్యుత్సాహంతో ఆ మాటలను సెంథిల్ అన్నాడని ఆ మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని ప్రభాస్ వెల్లడించారు.

డైనోసార్ బొమ్మ తుపాకీతో బ్యాంకు దోపిడీకి యత్నం.. దొంగ వెర్రితనానికి నవ్వాపుకోలేరు!
Advertisement

తాజా వార్తలు