మార్చి నెల స్టార్ట్ అయ్యింది.అలాగే సందడి కూడా అదే లెవల్ లో చేయడానికి టాలీవుడ్ సినిమాలు సిద్ధం అవుతున్నాయి.
ఈ నెలలోనే రెండు పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ అవ్వబోతున్నాయి.అందులో డార్లింగ్ ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా ఒకటి.
మరొకటి దర్శక ధీరుడు రాజమౌళి ఆర్ ఆర్ ఆర్.ఈ రెండు సినిమాలు ఒకే నెలలో రాబోతున్నాయి.దీంతో సినీ లవర్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
ముందుగా రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన పాన్ ఇండియా సినిమా రాధేశ్యామ్ మార్చి 11న రిలీజ్ కాబోతుంది.
ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది.ఆ తర్వాత రాజమౌళి తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్ సినిమా మార్చి 25న రిలీజ్ కాబోతుంది.ఇది దాదాపు 14 భాషల్లో విడుదల కానుంది.ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించారు.
ఈ రెండు రెండు వరాల వ్యవధి లోనే రావడంతో టాలీవుడ్ అభిమానులు రెడీగా ఉన్నారు.ఈ రెండు కూడా సంక్రాంతి బరిలో ఉండాలి కానీ కరోనా కారణంగా రెండింటిని కూడా వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.అప్పుడు కూడా వారం వ్యవధిలోనే ఈ రెండు సినిమా రిలీజ్ అవ్వాల్సి ఉన్నాయి.జనవరి 7న ఆర్ ఆర్ ఆర్ సినిమా, జనవరి 14న రాధేశ్యామ్ సినిమాలు బరిలోకి దిగాల్సి ఉండగా కరోనా అడ్డంకిగా మారింది.
అయితే ఈసారి మాత్రం రాధేశ్యామ్ ముందు వస్తుంటే.ఆర్ ఆర్ ఆర్ రెండు వారాల తర్వాత రానుంది.ఈ రెండు సినిమాలు కూడా టాలీవుడ్ లో 300 కోట్లకు పైగానే గ్రాస్ ని రాబడుతాయని అంచనా వేస్తున్నాయి ట్రేడ్ వర్గాలు సైతం పెద్ద సినిమాలు చాలా రోజుల తర్వాత వస్తున్నాయి కాబట్టి భారీ వసూళ్లను సాధించడం పక్కా అంటూ లెక్కలు వేస్తున్నారు.ఈలోపు ఏపీ లో టికెట్స్ ఇష్యు కూడా సమసిపోయే అవకాశం ఉంది.
దీంతో ఖచ్చితంగా ఈ సినిమాలు భారీ కెలెక్షన్స్ సాధించడం ఖాయంగా కనిపిస్తుంది.మరి ఈ రెండు సినిమాలు బరిలోకి దిగబోతున్న నేపథ్యంలో మాస్ జాతర కు ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు.