హాలీవుడ్ మూవీ ఆధారంగా 'ప్రాజెక్ట్ కే'.. వైరల్ అవుతున్న క్రేజీ బజ్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ( Prabhas ) ఒకేసారి మూడు నాలుగు ప్రాజెక్టులను సెట్స్ మీదకు తీసుకు వెళ్లిన విషయం తెలిసిందే.

ఈయన చేస్తున్న అన్ని ప్రోజెక్టుల మీద ప్రెజెంట్ ఆయన ఫ్యాన్స్ భారీ అంచనాలను పెట్టుకున్నారు.

మరి ప్రభాస్ వరల్డ్ లెవల్లో చేస్తున్న మూవీ ప్రాజెక్ట్ కే (Project K).నాగ్ అశ్విన్ ( Nag Ashwin ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా అప్డేట్ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ప్రజెంట్ శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ సినిమా ఇప్పటికే 75 శాతానికి పైగానే షూట్ పూర్తి చేసుకుంది.

ఇప్పటికే పలు క్రేజీ పోస్టర్స్ తో పాటుగా ఇంట్రెస్టింగ్ మేకింగ్ వీడియోస్ కూడా రిలీజ్ చేసి ఈ సినిమాపై హైప్ పెంచేశారు.అలాగే ఒక వైపు షూట్ పూర్తి చేసుకుంటూనే మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ఏకకాలం లోనే పూర్తి చేస్తున్నారు.

ఇలా నాగ్ అశ్విన్ ఒక పర్ఫెక్ట్ ప్లాన్ తో ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాను తీసుకు రావాలని కష్టపడుతున్నారు.మిగిలిన బ్యాలెన్స్ షూట్ కూడా మరికొన్ని వారాల్లో పూర్తి చేసి అక్టోబర్ తర్వాత నుండి ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలని మేకర్స్ ప్లాన్.వచ్చే ఏడాది జనవరి లోనే ఈ సినిమా రిలీజ్ ఉండడంతో అప్పటికే హైప్ క్రియేట్ అయ్యేలా చేసేందుకు కూడా కసరత్తులు చేస్తున్నారు.

Advertisement

ఇదిలా ఉండగా ఈ సినిమా ఒక హాలీవుడ్ సినిమా ( Hollywood Movie ) ఆధారంగా తెరకెక్కుతుంది అని తాజాగా ఒక బజ్ నెట్టింట వైరల్ అవుతుంది.2013లో హాలీవుడ్ లో పేదల న్యాయమైన డిమాండ్ల నుండి ప్రత్యేకాధికారులు తమని తాము రక్షించుకుని మనుగడ ఎలా సాగించారు అనే అంశంతో తెరకెక్కిన ఎలీసియం అనే సినిమా ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు అని టాక్ వినిపిస్తుంది.ఇది ఎంత వరకు నిజమో తెలియదు కానీ ఇప్పుడు ఈ వార్త నెట్టింట హాల్ చల్ చేస్తుంది.

ఇక వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్టు యూనిట్ సభ్యులు ప్రకటించారు.దీపికా పదుకొనె ( Deepika Padukone ) , అమితాబ్ బచ్చన్ ( Amitabh Bachchan ) వంటి భారీ తారాగణం భాగం అయిన ఈ సినిమాను అశ్వనీదత్ 500 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

సంతోష్ నారాయణ్ ( Santhosh Narayanan ) సంగీతం అందిస్తున్నారు.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్ లేకుండా డాకు మహారాజ్ హిట్టవుతుందా.. ఆ రేంజ్ కలెక్షన్లు వస్తాయా?
Advertisement

తాజా వార్తలు